పీరియడ్స్ టైంలో వీటిని అస్సలు తినకండి.. ఒకవేళ తిన్నారో..!
పీరియడ్స్ సమయంలో కొంతమందికి భరించలేని కడుపు నొప్పి, తిమ్మిరి, మూడ్ స్వింగ్స్, మలబద్దకం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్ని ఆహారాలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పీరియడ్స్ ఉన్న ఆ ఐదు రోజులు చాలా కష్టంగా గడిచేవారున్నారు. ఈ నెలసరి శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొన్ని ఆహారాలను తింటే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి నెలసరి నొప్పిని, తిమ్మిరిని, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను పెంచుతాయి. మరి ఈ సమయంలో ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
స్పైసీ ఫుడ్
నెలసరి సమయంలో మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే నెలసరి సమయంలో వీటిని తింటే కడుపులో మంట కలుగుతుంది. ఇక ఈ సమయంలో స్పైసీ ఫుడ్ ను తినడం వల్ల మీ గట్ ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది. అలాగే ఇది అల్సర్లకు దారితీస్తుంది. కడుపు నొప్పి కూడా పెరగొచ్చు. అందుకే స్పైసీ ఫుడ్ ను తినకండి.
మిల్క్ చాక్లెట్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పీరియడ్స్ సమయంలో చాక్లెట్ ను తినాలనే కోరికలు కలుగుతాయి. అయితే మీరు ఈ సమయంలో డార్క్ చాక్లెట్ నే తినండి. ఎందుకంటే ఇది పీరియడ్స్ ను సులభతరం చేస్తుంది.నొప్పిని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ పీరియడ్స్ తిమ్మిరిని దూరం చేస్తుందని సైన్స్ కూడా నిరూపించింది. మిల్క్ చాక్లెట్ కు బదులు డార్క్ చాక్లెట్ తినడం మంచిది.
ఫ్యాట్ ఫుడ్
చాలా మందికి ఫ్యాట్ ఫుడ్ బాగా నచ్చుతుంది. కానీ పీరియడ్స్ సమయంలో ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాలను అసలే తినకూడదు. ఇది కూడా పీరియడ్స్ సమస్యలను పెంచుతుంది.
పిజ్జా
పిజ్జా ఒక సంక్లిష్టమైన కార్బ్. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని తింటే మీరు బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే పీరియడ్స్ సమయంలో వీటిని తినకండి.
ఎర్ర మాంసం
రెడ్ మీట్ కూడా సంక్లిష్టమైన కార్బ్ కేటగిరీలోకే వస్తుంది. అయితే ఈ సమయంలో మాంసాహారం తినాలనుకుంటే గ్రిల్డ్ ఫిష్ ను తినండి. ఇది తొందరగా అరుగుతుంది.
మందు
పీరియడ్స్ సమయంలో వికారం, మైకము వంటి సమస్యలు రావడం చాలా సహజం. అయితే ఇలాంటి సమయంలో మందును తాగడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. ఆల్కహాల్ కారణంగా పీరియడ్స్ సమయంలో డీహైడ్రేషన్ మరింత పెరుగుతుంది. ఇది తీవ్రమైన తలనొప్పి, వాపునకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వైట్ రైస్
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమయంలో మీరు వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ నే తినాలి. అందులో కొద్ది పెరుగు కలిపి తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ కడుపునకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిని కాస్త తగ్గిస్తుంది.
కాఫీ
కాఫీ రీఫ్రెష్ గా అనిపించినా.. కాఫీ మీ ప్రేగులో చికాకును పెంచుతుంది. అలాగే మీ పీరియడ్స్ లో అసౌకర్యాన్ని పెంచుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో కాఫీని తగ్గించుకోవడం మంచిది. ఇది విరేచనాలకు కూడా కారణమవుతుంది.
శెనగపిండి, బీన్స్
పీరియడ్స్ సమయంలో బీన్స్, శెనగ పిండి వంటి ఆహారాలను కూడా తినకూడదు. ఇవి మంచి ప్రోటీన్ ఫుడ్ యే అయినా.. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను మరింత పెంచుతుంది.