పాలిచ్చే తల్లులు వీటిని తింటే..!
పాలిచ్చే తల్లులు కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇవి తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతాయి. అంతేకాదు తల్లులను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.

నవజాత శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలే పిల్లలకు మంచి పోషకాహారం. కాబట్టి పాలిచ్చే తల్లులు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఇది తల్లి పాలను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. పాలిచ్చే తల్లులు తమ డైట్ లో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
fenugreek water
మెంతులు
మెంతులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. డెలివరీ తర్వాత తల్లిపాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులు సహాయపడతాయి. ఇందుకోసం మెంతులను ఒక రోజు ముందు ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగండి. మెంతులతో కాచిన నీటిని తాగడం వల్ల కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది. తల్లుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
ajwain
అజ్వైన్
అజ్వైన్ లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇది బరువు తగ్గేందుకు, ఉబ్బరాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు దీనిలో పాల ఉత్పత్తిని ప్రోత్సహించే గెలాక్టాగోగ్స్ అనే రసాయనాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
నట్స్
నట్స్ పోషకాల బాంఢాగారం. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బాదం, వాల్ నట్స్, గుమ్మడి వంటి గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. నట్స్ కూడా కాల్షియానికి అద్భుతమైన మూలం. నట్స్ ను తిటే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
బీన్స్
బీన్స్, చిక్కుళ్లు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోఈస్ట్రోజెన్ లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా లాక్టోజెనిక్ చిక్కుళ్లలో పుష్కలంగా ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు వీటన్నింటినీ తీసుకోవడం మంచిది.
సోంపు గింజలు
సోంపు గింజలు కూడా తల్లి పాలను పెంచడానికి బాగా సహాయపడుతుంది. సోంపు గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియను సులభతరం అవుతుంది. అలాగే డెలివరీ తర్వాత వచ్చే మలబద్దకం నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. కాల్షియం, ఐరన్ మొదలైనవి సమృద్ధిగా ఉండే సోంపు గింజలతో మరిగించిన నీటిని తాగడం వల్ల తల్లిపాలు పెరుగుతాయి.
విత్తనాలు
విత్తనాలలో ప్రోటీన్, ఇనుము, జింక్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి కూడా పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతాయి.అందుకే పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, నువ్వులు మొదలైనవి తీసుకోవాలి.