మీకు బీపీ ఉందా? అయితే ఈ టిప్స్ మీకోసమే..
అధిక రక్తపోటు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాల్ని పెంచుతుంది. అందుకే అధిక రక్తపోటును ఎప్పుడూ కూడా నియంత్రణలో ఉంచుకోవాలి.

blood pressure
ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలి ద్వారా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో సహాయపడుతుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. బీపీ పేషెంట్లు ఎలాంటి ఆహారాలను తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
సిట్రస్ పండ్లు
నిమ్మకాయలు, దానిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో మీ రక్తపోటును నియంత్రించే సమ్మేళనాలు ఉంటాయి. ఈ సిట్రస్ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర మొక్కల భాగాలతో సహా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
Image: Getty
కొవ్వు చేపలు
గుండె పనితీరును మెరుగుపరిచే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్, పెరువియన్ ఆంకోవీస్ వంటి ఇతర కొవ్వు చేపలలో పుష్కలంగా ఉంటాయి. కొవ్వు చేపలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
Image: Getty
అమరాంత్
మెగ్నీషియం ఎక్కువగా ఉండే అమరాంత్ వంటి పోషకమైన ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా అధిక రక్త పోటును తగ్గుతుంది. ఒక కప్పులో వండిన అమరాంత్ లో మీరోజువారీ మెగ్నీషియం అవసరాలలో 38% అందిస్తుంది. మీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. తృణధాన్యాలను రోజుకు 30 గ్రాములు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం 8% తగ్గుతుందని తేలింది.
Image: Getty
క్యారెట్లు
రుచికరమైన కూరగాయ క్రిస్పీగా ఉంటుంది. అందుకే దీన్నివంటల్లో ఎక్కువగా వాడుతారు. క్యారెట్ లో క్లోరోజెనిక్, పి-కౌమరిక్, కెఫిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు రక్తపోటును తగ్గించడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
Image: Getty
గ్రీకు పెరుగు
గ్రీకు పెరుగును ఆవు పాల నుంచి తయారుచేస్తారు. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో రక్తపోటును తగ్గించే రెండు కీలక మూలకాలైన కాల్షియం , పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే మీ మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.