చర్మ సౌందర్యాన్ని పెంచే పెసలు.. ఇలా చేస్తే మీ చర్మం మెరిసిపోతుంది!
ప్రతి ఒక్కరు చర్మసౌందర్యం (Skin Glowing) కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. వీటి కోసం బయట దొరికే క్రీములను వాడుతుంటారు. అవి చర్మ మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి.

ప్రతి ఒక్కరు చర్మసౌందర్యం (Skin Glowing) కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. వీటి కోసం బయట దొరికే క్రీములను వాడుతుంటారు. అవి చర్మ మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. సహజ సిద్దమైన పదార్థాలు (Natural products) చర్మానికి చాలా మంచిది. అందులో ముఖ్యంగా పెసలు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
మొలకెత్తిన పెసలు (Sprouted peas) ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో విటమిన్ A, C చర్మాన్ని కాపాడతాయి. వీటిలోని ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు చర్మం కందిపోకుండా కోమలంగా ఉండేలా చేస్తాయి. చర్మం మృదువుగా, కోమలంగా, కాంతివంతంగా మారాలంటే పెసలుతో ఫేస్‌ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ (Face pack) ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
కొద్దిగా పెసరపిండిలో, చిటికెడు పసుపు, పచ్చిపాలు కలిపి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో (Cool water) ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మొటిమలను (Pimples) తగ్గించి ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.
skin care
పెసరపిండిలో కొద్దిగా పెరుగు 1స్పూన్ కీర రసం, 2 చుక్కలు లావెండర్ నూనె కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం పైన ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న నల్లమచ్చలు (Blackheads), జిడ్డును (Greasy) తగ్గిస్తుంది.
skin care
పావు కప్పు పెసర పిండికి అరచెంచా బియ్యం పిండి, కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాస్తు మసాజ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా (Brightly) మారుస్తుంది.
खूब सोए और पानी पीने
పెసరపిండిలో 3స్పూన్ ల యాపిల్ గుజ్జు, ఒక స్పూన్ తేనె కొంచెం నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని (Hot water) నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖం నల్లధనాన్ని (Dark face) తగ్గించి తాజాగా ఉండేలా చేస్తుంది.