Fennel Seed Water Benefits: ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే ఇన్ని లాభాలా?
Fennel Seed Water Benefits : సోంపు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. పైగా అరుగుదల పెరుగుతుంది. అందుకే హోటళ్లలో తిన్న తర్వాత సోంపు ఇస్తారు. అయితే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం వల్ల కలిగే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ ఉన్నాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సోంపు చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల చాలా మంది ఆరోగ్య నిపుణులు సోంపు నీటిని ఖాళీ కడుపుతో తాగమని సలహా ఇస్తారు. అంతేకాకుండా ఇది అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడుతుంది. సోంపు నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
జీర్ణ సంబంధిత సమస్యలు
సోంపు జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోంపులో ఉండే అలర్జీ నిరోధక, బాక్టీరియా వ్యతిరేక లక్షణాలు గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బరువు తగ్గాలని ఆలోచించే వారికి సోంపు నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం ద్వారా శరీరం చెడు కొవ్వును బయటకు పంపిస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ఇది ఆకలి లేకపోవడం లేదా ఎక్కువగా తినే సమస్యను కూడా నివారిస్తుంది. దీనివల్ల శరీర బరువు సులభంగా తగ్గుతుంది.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది
సోంపులో కాల్షియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల అవి రక్త ప్రవాహంలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడతాయి. హార్మోన్లను సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని కారణంగా చర్మంపై మంచి ప్రభావం ఉంటుంది. సోంపు నీటిని ముఖానికి రాసుకుంటే మొటిమలు, దురద వంటి సమస్యలు రావు.
కళ్ళకు మంచిది
సోంపులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ సోంపు నీటిని తాగడం ద్వారా కంటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
దంతాలు, చిగుళ్ళకు చాలా మంచిది
సోంపులో బాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉండటం వల్ల ఇది నోటిని తాజాగా ఉంచుతుంది. ఇంకా ఇది దంతాలు, చిగుళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది
సోంపు నీటిలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత ప్రమాదాలు కూడా రావు. సోంపు నీరు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: పిస్తా తింటే కంటి సమస్యలు కూడా తగ్గుతాయా? నిజం ఇదిగో
సోంపు నీటిని ఎలా తయారు చేయాలి
రాత్రిపూట సోంపును ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయం లేచిన వెంటనే ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. కావాలంటే సోంపును కూడా తినవచ్చు.
మరొక మార్గం ఏమిటంటే సోంపును వేయించి నీటిలో మరిగించి ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు. సోంపును టీగా కూడా తాగితే జలుబు, దగ్గు సమస్య నయమవుతుంది.
ఎవరు సోంపు నీరు తాగకూడదు
సోంపులో ఉండే నూనె చాలా మందికి అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. అలాంటి వారు సోంపు నీరు తాగకూడదు. గర్భిణీలు, పాలిచ్చే మహిళలు సోంపు నీరు తాగకూడదు. ఏదైనా రోగం తగ్గడానికి మెడిసన్ వాడుతున్న వారు డాక్టర్ సలహా లేకుండా సోంపు నీరు తాగకూడదు.