Health Tips: అతిగా అల్లం వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?
Health Tips: మామూలుగా అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ అతిగా అల్లం తీసుకోవటం ఒంటికి మంచిది కాదంట దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంట అవేంటో చూద్దాం.

సాధారణంగా అల్లం అనేక ఆరోగ్య సమస్యలని పరిష్కరిస్తుంది. అలాగే వంటలకి కూడా విపరీతమైన రుచిని తీసుకుని వస్తుంది. అల్లానికి ఎన్నో మంచి గుణాలు వలన చాలామంది నేరుగా తింటూ ఉంటారు మరి కొంతమంది టీ లో వేసుకొని తాగుతారు.
అయితే అల్లం అతిగా తినటం వలన కూడా చాలా సమస్యలు వస్తాయి అంట. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అల్లం నేరుగా తినటం వల్ల ఓరల్ అలర్జీ వస్తుంది దీనినే ఓరల్ అలర్జీ సెంట్రల్ అని కూడా అంటారు దీని వలన నోట్లో దురద చిరాకుగా అనిపిస్తుంది.
నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ప్రకారం అల్లాని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కడుపులో గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి దుష్ప్రభావానికి దారితీస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో అల్లాన్ని తీసుకోవడం వలన కడుపు నొప్పికి దారితీస్తుంది.
అల్లం ని అధికంగా వినియోగించే వారిలో గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది హృదయ స్పందనలో అసమానకులకు దారితీస్తుంది. అల్లం ఎక్కువ మోతాదులో తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పేగుల ద్వారా ఆహారం మల ప్రవాహం వేగం చేస్తుంది. కడుపులో అలజడిని రేపుతుంది. ఇది తీవ్రమైన అలసటకి బలహీనతకి దారితీస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో కూడా అలానే తక్కువగా తీసుకోవాలి లేదంటే వైద్యం సలహా మీదికి తీసుకోవాలి.
గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం రోజుకి 1500 మిల్లీగ్రాములు మించి అల్లాన్ని తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాగే అల్లం లో యాంటీ ప్లేట్లెట్ గుణాలు ఉంటాయి ఇది అధిక రక్తస్రావం జరగటానికి కారణం అవుతుంది. కాబట్టి అల్లం ఎంత ఆరోగ్యకరమైనదైనా మోతాదుకు మించి తీసుకోకండి.