గర్బిణీల్లో రక్తహీనతను తగ్గించే చిట్కాలు
ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు రక్తహీనత సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఎర్రరక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. కానీ ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
Image: Getty
గర్బిణులను ఎక్కువగా వేధించే సమస్య రక్తహీనత. దీనివల్ల గర్భధారణ సమయంలో అలసట, బలహీనత లేదా మైకం వంటి సమస్యలు వస్తాయి. ఇవి రక్తహీనత లక్షణాలు. అందుకే ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోవడం మంచిది. గర్భిణులు రక్తహీనతను పోగొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
వైద్య సలహా
డాక్టర్ సూచనలను తూ. చా తప్పకుండా పాటించండి. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఈ సమయంలో చిన్న సమస్యలు కూడా తల్లిని, బిడ్డను ప్రమాదంలో పడేస్తాయి.
Image: Getty
వైద్యం
కొన్నిసార్లు గర్భధారణ సమయంలో రక్తహీనత అంటువ్యాధులు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు అంతర్లీన సమస్యలకు చికిత్స తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గిపోతుందంటున్నారు నిపుణులు.
Image: Getty
విశ్రాంతి, ఒత్తిడి తగ్గింపు
గర్భిణులు వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడికి అస్సలు గురికాకూడదు. విశ్రాంతి తీసుకోకపోయినా.. ఒత్తిడితో ఉన్నా తల్లి ఆరోగ్యమే కాదు బిడ్డ ఆరోగ్యం కూడా పాడవుతుంది.
Image: Getty
తరచుగా భోజనం
కడుపులో బిడ్డ బలంగా ఎదగాలంటే పోషకాలనుు ఎక్కువగా తీసుకోవాలి. గర్భిణులు పోషక శోషణను పెంచడానికి, వికారం, వాంతులను నివారించడానికి రోజంతా కొద్ది కొద్దిగా, తరచుగా భోజనం చేయాలి. ఐరన్ లోపం వల్ల కూడా వాంతులు అవుతుంటాయి. అయితే పోషకాలు ఈ లోపాన్ని పోగొట్టడానికి సహాయపడతాయి.
Image: Getty
ఐరన్ ఇన్హిబిటర్లకు దూరంగా ఉండండి
కొన్ని పదార్థాలు ఇనుము శోషణను నిరోధిస్తాయి. ఇనుము ఎక్కువగా ఉండే భోజనం మాదిరిగానే టీ, కాఫీ, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే అవి ఇనుము శోషణను తగ్గిస్తాయి.
Image: Getty
ఫోలేట్, విటమిన్ బి 12
ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఈ పోషకాలు చాలా అవసరం. అందుకే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 ను తగినంతగా తీసుకోండి. బలవర్థకమైన తృణధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలలో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Image: Getty
ఐరన్ సప్లిమెంట్
కొన్నిసార్లు రక్తహీనతను తగ్గించడానికి ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలు సరిపోవు. గర్భధారణ సమయంలో ఇనుమును పెంచడానికి ఐరన్ సప్లిమెంట్లను తీసుకోండి. అయినప్పటికీ, ఏదైనా సప్లిమెంట్లను తీసుకునే ముందు డాక్టర్ ను తప్పకుండా సంప్రదించాలి.