Health Tips: బీపీని కంట్రోల్ లో ఉంచాలంటే.. వాముని ఈ విధంగా ఉపయోగించండి!
Health Tips: బిపి అనేది నేడు సర్వసాధారణమైన ఒక అనారోగ్య సమస్య. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. అయితే వాముని ఉపయోగించి బీపీని కంట్రోల్ లో ఉంచవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో చూద్దాం.
నేటి ఒత్తిడి ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి వచ్చే సమస్య బీపీ. అలా అని దీనిని నిర్లక్ష్యం చేయలేం, ఎందుకంటే బీపీ ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే రక్తపోటుని నియంత్రించడానికి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రయత్నించవచ్చు.
అందులో ఒకటి వాము ఈ వాముని ఉపయోగించి ఎలా బీపీ ని తగ్గించాలో ఇప్పుడు చూద్దాం. వాము జీర్ణక్రియ కు బాగా ఉపయోగపడుతుంది. వాము నీటితో తీసుకున్నప్పుడు బరువు తగ్గటానికి మరియు కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. రక్తపోటుని, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది. దీనికి గాయాలను నయం చేసే గుణం ఉంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, సోడియం, ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి.
రక్తపోటుని నియంత్రించడం కోసం ఒక చెంచా వాముని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టండి, మరుసటి రోజు మరిగించి వడకట్టి చల్లారనివ్వండి. ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగటం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అయితే దీనిని ఎక్కువగా తీసుకోకూడదు కేవలం ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి.
అలాగే వాము కడుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని తినడం వల్ల బాగా జీర్ణం అవుతుంది. అలాగే ఆహార విషాన్ని కూడా నివారిస్తుంది. అన్నవాహిక లో ఏర్పడే వాపుని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ..
జలుబు మరియు దగ్గు నివారించడంలోనూ వాము ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాము నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులకు చాలా మంచిది. దీనిని తరచుగా తీసుకోవడం వలన ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలను నివారించవచ్చు.