కొలెస్ట్రాల్ ను తగ్గించడమెలా?
మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్నితగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
Cholesterol
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండు చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక చెడు కొలెస్ట్రాల్ మాత్రం మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. దీన్నే హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ధమనుల్లో పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల మన గుండెకు సరిగ్గా రక్తం చేరదు. ఇది గుండెపోటుతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
cholesterol
చెడు కొలెస్ట్రాల్ పెరగిపోవడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కరానం. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎన్నో మార్పులు వస్తాయి. కొంతమందికి మొదట్లో కాళ్లలో తిమ్మిరి, మెడ వెనుక భాగంలో బెణుకు, కాళ్ల భాగంలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుండెకు చేరే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఛాతీనొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడిచేటప్పుడు మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ ప్రమాదకరమైన సంకేతాలు. ఇలాంటి సమయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా అయితే మాత్రం గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలేమీ రాకూడదంటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
cholesterol
హెల్తీ ఫుడ్స్
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు హెల్తీ ఫుడ్ ను మాత్రమే తినాలి. ఎందుకంటే ఇది మీ శరీరంలో కొవ్వును పెంచదు. కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆహారాలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చండి. అలాగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఆహారాలను తినండి. చిక్కుళ్లు, గింజలు, ఆపిల్, ఆకుకూరలు, వెల్లుల్లి మొదలైనవి వాటిని తింటే కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
రెడ్ మీట్
రెడ్ మీట్ టేస్టీగా ఉండొచ్చు. కానీ కొలెస్ట్రాల్ తగ్గాలంటే మాత్రం దీన్ని తగ్గించాల్సిందే. అలాగే కొవ్వులు, స్వీట్లు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా మీరు చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచుతాయి.
బరువు నియంత్రణ
మీ ఎత్తుకు తగ్గ బరువును మాత్రమే ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే ఎన్నో రోగాలు వస్తాయి. ఎందుకంటే ఊబకాయం ఉన్నవారికి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో సంబంధం ఉన్న వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
వ్యాయామం
కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా రోజుకు కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. దీనివల్ల మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబుబులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వ్యాయామం చేస్తే మీరు బరువు కూడా తగ్గుతారు.
స్మోకింగ్
స్మోకింగ్ కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాదు ఈ ధూమపానం ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీరు స్మోకింగ్ ను మానేస్తే మంచి కొలెస్ట్రాల్ (హెచ్డిఎల్) పెరుగుతుంది, ఇది కొరోనరీ ధమనులను రక్షిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది.