ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదా? అయితే ఇప్పటి నుంచి వీటిని ఖచ్చితంగా తినండి
కొంతమంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొంచెం కూడా బరువు తగ్గరు. ఇలాంటి వారు కొన్ని ఆహారాలను తింటే మంచి ఫలితాలను పొందుతారని నిపుణులు అంటున్నారు.

మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఆనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని నివారించడంతో పాటు కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే ఊబకాయాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాదు కొన్ని రకాల ఆహారాలు కూడా బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడతాయి. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం మీ కడుపును త్వరగా నింపుతుంది. దీంతో మీరు వేగంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు
బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు మంచి మేలు చేస్తుంది. పెరుగు మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. 100 గ్రాముల పెరుగులో 56 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి. ఆకలిని తగ్గించడానికి పెరుగు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Image: Getty Images
తృణధాన్యాలు
మొలకెత్తిన తృణధాన్యాలు, చిక్కుళ్లను తినడం కూడా బరువు చాలా వరకు తగ్గుతారు. వీటిలో మెగ్నీషియం, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఉదయాన్నే గోధుమలు, ఓట్స్ ను తినండి.
green peas
పచ్చి బఠానీలు
పచ్చి బఠానీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. వీటిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు పచ్చి బఠానీలను మీ డైట్ లో చేర్చుకోండి.
గుడ్లు
గుడ్లు పోషకాల భాండాగారం. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలేట్, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. అందుకే గుడ్లను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. గుడ్లు మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే వ్యాయామం చేయడానికి మీకు శక్తిని ఇవ్వడానికి సహాయపడుతాయి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా బరువు తగ్గిస్తాయి.