మలబద్దకం నుంచి బయటపడాలంటే ఇలా చేయండి
మలబద్దకం సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడం, నీళ్లను పుష్కలంగా తాగకపోవడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది.
constipation
జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా మలబద్దకం బారిన పడుతుంటారు. మలబద్దకం సర్వ సాధారణ సమస్య. కానీ ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. నిజానికి మలబద్దకం సమస్య రావడానికి ఎన్నో కారణాలున్నాయి. రోజంతా నీటిని పుష్కలంగా తాకపోవడం, ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారాలను తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని రకాల మందుల వాడకం వంటివి మలబద్దకానికి దారితీస్తాయి.
అయితే చాలా మంది మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులను వాడుతుంటారు. అయితే ఇంట్లో ఉండే కొన్ని రకాల చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
constipation
1. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బెల్లం, నెయ్యిని కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నెయ్యిలో మన ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులుఉంటాయి. ఈ కలయిక మృదువైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది. అలాగే ఇవి పోషకాల శోషణను పెంచుతాయి. అలాగే శరీరంలోని విషాన్ని సమర్థవంతంగా బయటకు తొలగిస్తాయి.
2. నిర్జలీకరణం కూడా మలబద్దకానికి కారణమవుతుంది. అందుకే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయను తినండి. ఇది మీ శరీరాన్నినిర్జలీకరణం నుంచి బయటపడేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. పుచ్చకాయను ఈవెనింగ్ స్నాక్స్ గా కూడా తినొచ్చు. పుచ్చకాయ సీజన్ లో లేకపోతే బాగా పండిన అరటిపండ్లను తిన్నా సమస్య నుంచి బయటపడతారు.
3. రాత్రి భోజనంలో నువ్వులను చేర్చుకోవడం వల్ల కూడా మీరు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు. నువ్వుల్లో ఫైబర్, విటమిన్ ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు ఇవి మీ మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి.