MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బొప్పాయిని తింటే ఈ వ్యాధులు దూరం..!

బొప్పాయిని తింటే ఈ వ్యాధులు దూరం..!

ఇది పండు మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి ఔషదం లాగ పనిచేస్తుంది. అవును ఈ పండును తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని నిపుణులు అంటున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 27 2023, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Papaya

Papaya

బొప్పాయిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో పాపైన్ అనే ఎంజైమ్ కూడా ఎక్కువ ఉంటుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్స్ మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి, మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

26
Papaya

Papaya

బొప్పాయిని మీ ఆహారంలో చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. బొప్పాయిలో ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఫైబర్ ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచతాయి. బొప్పాయిలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తాయి.
 

36

కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందినప్పుడు, ఇది గుండె జబ్బులకు దారితీసే అడ్డంకులను సృష్టించే అవకాశం ఉంది. అలాగే బొప్పాయిలో  పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బొప్పాయిలో రెండు ఎంజైములు ఉంటాయి. పాపైన్, చిమోపాపైన్. ఈ రెండు ఎంజైములు ప్రోటీన్లను జీర్ణం చేస్తాయి. అంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మంటను తగ్గిస్తుంది.

46
Papaya

Papaya

తక్కువ కేలరీలు, పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే బొప్పాయి ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ పండు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. 

56
Papaya

Papaya

బొప్పాయి పండు మాత్రమే కాదు బొప్పాయి విత్తనాలు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండదు. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది. 
 

66
papaya

papaya

బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్స్ శరీరం నుంచి విషాన్ని సమర్థవంతంగా తొలగించడానికి సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం  వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇది బ్యాక్టీరియా, వైరల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curry Leaves Side Effects: కరివేపాకును వీళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Hair : బట్టతల సమస్యకు చెక్.. DHT అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
Recommended image3
Clove Water: రోజూ లవంగాల నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ పరార్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved