రోజూ బ్రెడ్ తింటే ఏమౌతుంది?
ప్రతిరోజూ ఉదయాన్నే బ్రెడ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు రోజూ బ్రెడ్ తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
ఈ రోజుల్లో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినడం చాలా కామన్ అయిపోయింది. టీ, కాఫీలతో పాటుగా, బ్రెడ్ జామ్, బ్రెడ్ ఆమ్లేట్ అంటూ ఏదో ఒక విధంగా ఉదయాన్నే బ్రెడ్ ను తింటుంటారు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలకు కూడా ఉదయాన్నే బ్రెడ్ ను తినిపిస్తున్నారు. ఎందుకంటే దీన్ని వండనవసరం లేదు. అలాగే తొందరగా కడుపు నిండుతుంది. ఈ కారణాలతోనే చాలా మంది ఉదయాన్నే బ్రెడ్ ను తింటుంటారు. కానీ రోజూ బ్రెడ్ ను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బరువును పెంచుతుంది
బ్రెడ్ ను తినే వారు బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే బ్రెడ్ లో షుగర్, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీర బరువును బాగా పెంచుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను తింటే బరువు పెరుగుతారు. మీరు గనుక ఒకసారి బరువు పెరుగుతున్నట్టైతే దాన్ని కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు.
బ్లడ్ షుగర్ పెరుగుతుంది
బ్రెడ్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇక మీరో ప్రతిరోజూ బ్రెడ్ ను తింటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ఇది మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు బ్రెడ్ ను తినకూడదు. ఒకవేళ తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది.
ఉదర సంబంధ సమస్యలొస్తాయి
ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తింటే కడుపునకు సంబంధించిన సమస్యలు రావు. జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. కానీ బ్రెడ్ లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని తింటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే బ్రెడ్ పేగులకు అంటుకుంటుంది. ఎందుకంటే ఇది మైదా పిండితో తయారవుతుంది. మీకు తెలుసా? మన కడుపు పిండితో చేసిన దాన్ని తొందరగా జీర్ణించుకోలేదు. దీంతో జీర్ణ సమస్యలతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తాయి.
గుండెకు ప్రమాదం
బ్రెడ్ లో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీరు ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను తింటే మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బ్రెడ్ కు బదులుగా తృణధాన్యాలను తినండి
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు బ్రెడ్ కు బదులుగా క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలను తినొచ్చు. ఎందుకంటే వీటిలో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మీరు బ్రెడ్ కు బదులుగా ధాన్యాలను తింటే మీకు శక్తి అందుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
Image: Freepik
లిమిట్ లో తినాలి
మీరు బ్రెడ్ ను లిమిట్ లో తింటే దీనివల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అయితే మీరు బ్రెడ్ ను కూరగాయలు, పండ్లతో తినొచ్చు. ఇలా తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు, ఫైబర్ అందుతాయి. బ్రెడ్ కు బదులుగా మీరు బాదం, వాల్ నట్స్, చియా విత్తనాలు వంటి గింజల్ని, విత్తనాల్ని తినండి. వీటిలో రకరకాల విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని హెల్తీగా ఉంచుతాయి.