వాల్ నట్స్ తింటే ఆ సమస్యలు అన్నీ మాయం.. అవి ఏమిటంటే?
వాల్ నట్స్ (Walnuts) శరీరానికి పోషకాలను అందించే బలమైన ఆహారం. మెదడు ఆకారాన్ని పోలి ఉండే ఈ డ్రైఫ్రూట్ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) అందిస్తుంది. ఇది శరీరానికి శక్తిని అందించే మంచి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతుంది. వీటిని తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నట్స్ అన్నింట్లో కల్లా బలమైన ఆహారం. ఇందులో కొవ్వు శాతం (Fat content) కాస్త ఎక్కువగానే ఉంటుంది. నూరు గ్రాముల వాల్ నట్స్ నుంచి సుమారు 64 శాతం కొవ్వు, 687 కేలరీల శక్తి లభ్యమవుతుంది. ఇందులో ప్రోటీన్లు (Proteins) 15 గ్రాములు, పిండి పదార్థాలు 11 గ్రాములు ఉంటాయి.
ఇందులో విటమిన్లు (Vitamins), కాల్షియం, పొటాషియం (Potassium), సోడియం, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది: ఇందులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (Good cholesterol) శాతాన్ని పెంచుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరుస్తాయి.
గర్భిణీలకు మంచిది: వాల్ నట్స్ లో పోలిక్ యాసిడ్ (Folic acid) పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణిలా ఆరోగ్యానికి మంచిది. కనుక గర్భధారణ (Pregnancy) సమయంలో మహిళలు వీటిని తీసుకోవడం మంచిది. ఇవి కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కూడా సహాయపడతాయి.
రక్తహీనత సమస్యలు తగ్గుతాయి: రక్తహీనత (Anemia) సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే పోషకాలు రక్తహీనత సమస్యను తగ్గించడానికి సహాయపడుతాయి. రాత్రంతా నీళ్ళలో నానబెట్టిన వాల్ నట్స్ (Soaked walnuts) ను ఉదయం తింటే మంచి ఫలితం ఉంటుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది: ఇందులో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచి మెదడు ఆరోగ్యాన్ని (Brain health) పెంచుతాయి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యలను తగ్గించి జ్ఞాపకశక్తిని (Memory) పెంచుతాయి.
ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: వాల్ నట్స్ లో ఉండే పోషకాలు పేగులోని చెడు బ్యాక్టీరియాను (Bad bacteria) నశింపచేసి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. ఫలితంగా ఉదర భాగాన్ని ఆరోగ్యంగా (Abdominal part healthy) ఉంచుతాయి.
బరువును నియంత్రణలో ఉంటుంది: వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు ఉన్న వారు వీటిని తింటే త్వరగా ఆకలి వేయదు. దాంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఇందులో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను (Digestion) మెరుగుపరిచి తిన్న ఆహారాన్ని తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి. వీటిని నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.
ఎముకలను బలంగా మారుస్తాయి: ఎముకల దృఢత్వానికి వాల్ నట్స్ లోని పోషకాలు చక్కగా సహాయపడతాయి. ఇందులో ఉండే క్యాల్షియం (Calcium) ఎముకలకు కావలసిన శక్తిని అందించి బలంగా మారుతాయి. కీళ్ల నొప్పులు (Arthritis), నడుం నొప్పి నుంచి విముక్తి కలిగిస్తాయి.