ఈ పదార్థాలు బాగా తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా.. అవేంటో తెలుసా?
ప్రస్తుతకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అమ్మాయిలు అన్ని రంగాలలోనూ అబ్బాయిలతో సమానంగా దూసుకుపోతున్నారు. కానీ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు పౌష్టికాహారం (Nutrition), వ్యాయామం (Exercise) విషయంలో అశ్రద్ధ చేస్తున్నారని ఒక సంస్థ చేపట్టిన పరిశోధనలో తేలింది. అయితే ఎలాంటి నియమాలను పాటిస్తే అందమూ, ఆరోగ్యము పెరుగుతుందో తెలుసుకుందాం..

మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు (Nutrients) ఉండేలా చూసుకోవాలి. ఆహారంతోపాటు శరీరానికి శారీరక శ్రమ (Physical activity) కూడా అవసరమే. ఇందుకోసం రోజు కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పౌష్టికాహారం, వ్యాయామం మన జీవితంలో అలవరచుకుంటే అందమూ, ఆరోగ్యమూ పెరుగుతుంది.
ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలను తీర్చుకుని గోరువెచ్చని నీటిని తాగాలి. తరువాత కొంత సమయం వ్యాయామం చేయడం తప్పనిసరి. వ్యాయామం చేసిన అరగంట తరువాత ఒక గ్లాసు పాలు (Milk), నానబెట్టుకున్న 10 బాదం పప్పులు (Almond), రెండు ఖర్జూరాలను (Dates) తీసుకోవాలి. ఒకవేళ ఇలా కుదరకపోతే రెండు ఇడ్లీలు, పాలు తీసుకున్న ఆరోగ్యానికి మంచిది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు భోజనానికి మధ్య ఆకలేస్తే పండ్ల రసాలను (Fruit juices) తీసుకోవడం ఉత్తమం. మధ్యాహ్న భోజన సమయంలో కాయగూరలు, పప్పు, పెరుగు, ఆకుకూరలు, చేపలు, బఠానీలు, రాజ్మా వంటి పోషకాలు కలిగిన పదార్థాలను తీసుకోవాలి. ఈ పదార్థాలలో జింక్, క్యాల్షియం, ఐరన్, విటమిన్లు (Vitamins) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి, అందానికి మంచివి.
మీరు ఎక్కడ ఉన్నా అరగంటకు ఒకసారి కనీసం రెండు నిమిషాలైనా నడవడం మంచిది. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి పదార్దాలను సాయంత్రం వేళ స్నాక్స్ గా తీసుకోరాదు. వీటికి బదులుగా అటుకులు, పల్లి చిక్కీ, మొక్కజొన్న, పండ్లు వంటివి తీసుకోవాలి. ఇవి శరీరానికి తగిన పోషకాలు అందించే శరీర ఆరోగ్యాన్ని (Health) మెరుగు పరచి అందాన్ని (Beauty) కూడా పెంచుతాయి.
అయితే ఏ పదార్థాలు అయినా తిన్న తరువాత రెండు నిమిషాలు నడవడం ఆరోగ్యానికి మంచిది. వీటితో పాటు రోజులో తగిన మొత్తంలో నీటిని (Water) తీసుకోవడం అవసరం. రాత్రి సమయంలో తేలికగా జీర్ణమయ్యే (Easily digestible) ఆహార పదార్థాలను తీసుకోవాలి. చపాతీ, అన్నం, కూరలను తినవచ్చు. రాత్రి వేళలో మసాలా మాంసాహారాలను తక్కువగా తీసుకోవడం మంచిది.
రాత్రి భోజనం తర్వాత రెండు గంటల తరువాత పడుకోవాలి. కనుక సాధ్యమైనంత వరకు రాత్రి వేళలో భోజనం తొందరగా తినడం మంచిది.
మన జీవన విధానంలో (Lifestyle) మనం తీసుకునే ఆహార పదార్థాల మీద కూడా అందం ఆధారపడి ఉంటుంది. మన శరీరానికి తగిన పోషకాలను అందించినప్పుడు బయట మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) వాడకం అవసరమే ఉండదు.
కనుక మన అందం ఎప్పుడూ మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి (Depending on) ఉంటుంది. కాబట్టి పోషకాలను అందించే ఆహార పదార్థాలను ఒక క్రమపద్ధతిలో (Systematization) బాగా తింటూ అందాన్ని పెంచుకోవచ్చు.