ఉదయం లేవగానే టీ తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యలొస్తయా?
ఉదయం లేవగానే కప్పు టీ తాగేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది ఉదయం లేవగానే ఒక కప్పు వేడి వేడి టీ లేదా కాఫీని తప్పకుండా తాగుతారు. ఇలా టీ లేదా కాఫీ తాగడం వల్ల రీఫ్రెష్ గా అనిపిస్తుంది. తక్షణమే శక్తి వస్తుంది. అందుకే చాలా మందికి ఉదయం లేవగానే కప్పు కాఫీ లేదా టీని తాగే అలవాటు ఉంటుంది. విచిత్రం ఏంటంటే.. ఈ అలవాటును మానుకోవడం చాలా చాలా కష్టం. టైం టూ టైం వీటిని తాగేవారు ఇవి లేకుండా ఉండలేరు. కానీ టీని రోజుకు రెండు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. నిద్రలేమి బారిన పడేస్తుంది.
అయితే ఉదయం లేవగానే టీ తాగడం వల్ల గ్యాస్ సమస్య వస్తుందన్న మాటను వినే ఉంటారు. ఇది నిజమే. దీనిలో ఉండె కెఫిన్ గ్యాస్ కు కారణమవుతుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. ఇది చాలా మందికి అలవాటు కాబట్టి ఉదయం దీన్ని తాగడకుండా నివారించలేము.
ఉదయాన్నే పరగడుపున టీ తాగడం వల్ల గ్యాస్ వస్తుందని ఆరోగ్యా నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని పరిగడుపున తాగకూడదు. లేదంటే టీ వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే ఉదయాన్నే పరగడుపున టీ తాగడం ఆరోగ్యానికి ఏవిధంగానూ మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం మీరు లేవగానే చేయాల్సిన మొదటి పని గ్లాస్ నీళ్లను తాగడం. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అందుకే ఉదయం లేవగాన్నే నీళ్లను తాగి.. ఆ తర్వాత ఏదైనా స్నాక్స్ ను రెడి చేయండి. దీన్ని తిని.. కొద్దిసేపటి తర్వాతే టీ తాగండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య రాదు.
ఉదయం పరిగడుపున టీ తాగే అలవాటు కొంతమందిలో ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇవి రోజంతా ఉంటాయి. టీలో ఉండే 'టానిన్' కడుపు లోపల జీర్ణ రసాలను సృష్టించగలదు. ఎలాంటి ఆహారం తీసుకోకపోతే ఖాళీ కడుపులో జీర్ణ రసం ఉత్పత్తి అయి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కొంతమంది అల్పాహారానికి ముందు చాలాసార్లు టీ తాగుతారు. ఇది ఖచ్చితంగా గ్యాస్ సంబంధిత సమస్యలు పెరగడానికి దారితీస్తుంది.
టీ ని ఎక్కువగా తాగినప్పుడు టీలోని కెఫిన్ మన శరీరాన్ని నిర్జలీకరణం బారిన పడేస్తుంది. ఇది ఒక్కోసారి మన ప్రాణాలను కూడా తీసేయగలదు. అందుకే ఉదయాన్నే టీని తాగకూడదు. మీరు సాధారణంగా గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటే.. ఉదయం పరిగడుపున టీ తాగడం మానుకోవాలి. అలాగే రోజుకు చాలాసార్లు టీ తాగే అలవాటును కూడా మానుకోండి. టీతో పాటు హెల్తీ స్నాక్స్ తినడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.