HealthTips: నడుము నొప్పితో విసిగిపోయారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే!
Health Tips: నడుము నొప్పి సమస్య చాలా ఇబ్బందికరమైనది. అయితే ఈ నడుము నొప్పి రావడానికి కారణాలు ఏమిటో..చిన్న చిన్న చిట్కాలతో నడుము నొప్పిని మాయం చేయటం ఎలాగో తెలుసుకుందాం.

నడుము నొప్పి వయసుతో సంబంధం లేకుండా అందరినీ బాధిస్తున్న ఒక సమస్య. ఇది రోజువారి పనులు కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇది పెద్ద జబ్బేమీ కాదు కదా అని అశ్రద్ధ చేయొద్దు ఎందుకంటే మీ ప్రాణాల మీదకి తీసుకురావచ్చు. అసలు నడుము నొప్పి రావడానికి కారణాలు ఏంటో పరిశీలిద్దాం.
సాధారణంగా నడుము నొప్పి ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళకి, కూర్చున్న దగ్గర నుంచి లేవకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళకి అలాగే అనుకోకుండా నడుముకి దెబ్బ తగలడం వలన నడుము నొప్పి సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది.
అయితే ఈ సమస్య మొదటి దశలోనే ఉంటే చిన్ని చిన్ని చిట్కాలతో నొప్పిని మాయం చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా మనం పడుకునే పరుపులు మరీ మెత్తగాను గట్టిగాను కాకుండా సమాంతరంగా ఉండేలాగా చూసుకోవాలి.
బోర్లా పడుకునే అలవాటు ఉంటే తగ్గించాలి. అలాగే సంవత్సరాల తరబడి ఒకే పరుపుని వాడటం కూడా మంచిది కాదు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నిటారుగా ఉండి డ్రైవ్ చేయాలి. ఆ సమయంలో వీపుకి సపోర్టు ఇచ్చేలాగా వెనక దిండు పెట్టుకోవాలి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చునేటప్పుడు మానిటర్ కళ్ళకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి.
పాదాలు పూర్తిగా నేలను తాకాలి. కుర్చీ ఎత్తుగా ఉంటే పాదాల కింద ఎత్తు పెట్టుకోవాలి. వీపు వంపు దగ్గర చిన్న దిండు లేదా చున్నీ లాంటిది పెట్టుకోవడం వలన నడుము మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన చిన్న చిన్న ఎక్సర్సైజ్ లు చేయడం వలన కూడా నొప్పిని దూరం చేయవచ్చు.
అలాగే కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరాన్ని కలిపి ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత చల్లార్చి ఒక డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు మర్దన చేసుకోవడం వలన నొప్పి కాస్త నెమ్మదిస్తుంది. ఇన్ని చేసినా కూడా నొప్పి తగ్గటం లేదు అంటే వైద్యుడ్ని సంప్రదించడమే మంచిది.