MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • రెగ్యులర్ గా కాఫీ తాగితే కంటి చూపు దెబ్బతింటుందా?

రెగ్యులర్ గా కాఫీ తాగితే కంటి చూపు దెబ్బతింటుందా?

టీ, కాఫీని తాగడం మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు తరచుగా చెప్తుంటారు. టీ, కాఫీలను తాగడం వల్ల తక్షణమే ఎనర్జీ వచ్చినా.. ఇది మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. కాఫీని ఎక్కువగా తాగడం వల్ల మీ కంటి చూపు దెబ్బతింటుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 23 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image: Getty

Image: Getty

కాఫీ, టీలను తాగని వారు ఎవరూ ఉండరు. మనలో చాలా మంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీని తాగుతుంటారు. టీ, కాఫీలు మనల్ని రీఫ్రెష్ చేస్తాయి. తక్షణమే ఎనర్జీని ఇస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మెదడును చురుగ్గా చేస్తాయి. కానీ వీటిని రోజూ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
black coffee

black coffee

కాఫీని తాగడం వల్ల కలిగే వచ్చే అనారోగ్య సమస్యల్లో ఒకటి.. ఎక్కువ కాఫీని తాగడం వల్ల మీ కంటి చూపు దెబ్బతింటుంది. కాఫీ నిజంగా దృష్టిని ప్రభావితం చేస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

కాఫీ లేదా టీ ని మితంగా మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాఫీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీలో ఉండే కెఫిన్, ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఎన్నో విధాలుగా మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
 

46
coffee

coffee

కాఫీ బరువు, కాలేయ ఆరోగ్యం లేదా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కానీ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, నిద్రలేమి, చంచలత, నిర్జలీకరణం వంటి సమస్యలు వస్తాయి. 

56
Image: Getty Images

Image: Getty Images

ఎక్కువ కాఫీని తాగడం వల్ల దృష్టిపై ప్రభావం చూపుతుందనే వాదనలు ఉన్నాయి. ఓ ప్రముఖ ప్రచురణ 'ఇన్వెస్టిగేటివ్ ఆప్తాల్మాలజీ అండ్ విజువల్ సైన్సెస్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. జన్యుపరంగా కంటిని ఆకర్షించే వ్యాధి అయిన గ్లాకోమాతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీని ఎక్కువగా తాగడం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ మెడికల్ అసోసియేషన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. గ్లాకోమా ప్రమాదం వంశపారంపర్యంగా ఉన్నప్పటికీ.. మితమైన మొత్తంలో కాఫీని తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదు.

66
coffee cup

coffee cup

వీటన్నిటినీ పరిశీలిస్తే కాఫీని మితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు. స్వీట్లను కంట్రోల్ చేయాల్సిన వారు కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాఫీని మితంగా తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అయితే కాఫీని ఎట్టి పరిస్థితిలో ఎక్కువగా తాగకూడదు. ఇది ఏ రకంగానూ ఆరోగ్యానికి మంచిది కాదు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved