తల్లిపాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా? తగ్గుతుందా?
తల్లులు పిల్లలకు పాలివ్వడం వల్ల వారి రొమ్ములల్లో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది వారికి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ వక్షోజాలలో ఎన్నో మార్పులకు దారితీస్తుంది. అంతేకాదు మీరు మీ బిడ్డలకు పాలివ్వడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది తల్లిపాలివ్వడం వల్ల క్యాన్సర్ వస్తుందని నమ్ముతున్నారు. మీకు తెలుసా? ప్రతి ఎనిమిది మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక రకమైన రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారట. నిజానికి తల్లి పాలివ్వడం లేదా పంపింగ్ మీ రొమ్ములో మార్పులకు దారితీస్తుంది. కానీ ఇది మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు
తల్లి పాలలో.. శిశువు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ప్రతిరోధకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వారి గట్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. తల్లి పాలలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా హానికరమైన వ్యాధికారకాల నుంచి రక్షించేటప్పుడు జీర్ణక్రియ, పోషకాల శోషణకు కూడా సహాయపడుతుంది. ఈ శరీరక ప్రయోజనాలతో పాటుగా తల్లిపాలివ్వడం వల్ల బిడ్డకు, తల్లికి బలమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. తల్లి పాలివ్వడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ మీకు, మీ బిడ్డకు స్పర్శ అనుభందం పెరుగుతుంది. ఐ కాంటాక్ట్ కూడా పెరుగుతుంది. ఇది బంధం, భావోద్వేగ భద్రతను ప్రోత్సహిస్తుంది.
అలాగే పాలిచ్చే సమయంలో హార్మోన్ల మార్పిడి తల్లి, బిడ్డ ఇద్దరిలో ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మీ మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధం భావాలను పెంచుతుంది. చాలా మంది మహిళలు తల్లిచ్చే సమయంలో నిపుణుడి సహాయం తీసుకుంటారు. కానీ కొంతమంది మహిళలు తల్లి పాలివ్వడం చుట్టూ ఉన్న అపోహల కారణంగా పాలివ్వడానికి సంకోచిస్తారు.
తల్లి పాలివ్వడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరగదు
పాలివ్వడం వల్ల మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నిజానికి తల్లిపాలివ్వడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు వెళ్లడించాయి. తల్లి పాలివ్వడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు స్థిరంగా కనుగొన్నాయి. ముఖ్యంగా వీళ్లు ఎక్కువ కాలం తల్లి పాలిస్తే అంటే.. 2 సంవత్సరాలు తల్లి పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 1 శాతం తగ్గతుందని క్యాన్సర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం కనుగొంది.
అలాగే తల్లి పాలివ్వడం వల్ల అండాశయ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుందని అధ్యయనం కనుగొంది. తల్లి పాలివ్వడం వల్ల ఈస్ట్రోజెన్ విడుదలను నిరోధిస్తుంది.ఇది ఈ క్యాన్సర్లతో ముడిపడి ఉన్న హార్మోన్లకు గురికావడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు పాలివ్వడం వల్ల రొమ్ము నాళాలు, అండాశయాల నుంచి కణాలను మరింత వేగంగా తొలగించడానికి సహాయపడుతుంది. దీంతో పరివర్తన చెందిన కణాలు అభివృద్ధి చెందకుండా ఉండటానికి, కణితులు ఏర్పడే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని వెళ్లడించింది.