MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Life
• Health
• గన్నేరు పువ్వు తింటే నిజంగానే చనిపోతారా..? ఆ రాష్ట్రంలో ఎందుకు నిషేధించారు..?

గన్నేరు పువ్వు తింటే నిజంగానే చనిపోతారా..? ఆ రాష్ట్రంలో ఎందుకు నిషేధించారు..?

చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి  ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు

2 Min read
Author : ramya Sridhar
Published : May 16 2024, 02:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

oleander

oleander

గన్నేరు మొక్కలను ఎవరూ స్పెషల్ గా పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ  పెరిగేస్తూ ఉంటాయి. చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి  ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే... కేరళలో మాత్రం ప్రస్తుతం ఈ పూలను బ్యాన్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

oleander

oleander

మరీ ముఖ్యంగా ఈ పూలను గుడిలోకి తీసుకురావద్దని, స్వామివారికి సమర్పించవద్దు అని చెప్పారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఓ వ్యక్తి.. ఏదో అనుకొని... ఈ పువ్వు రెమ్మలను నమిలాడట. గన్నేరు పువ్వు, కాయలు విషంతో సమానం అని తెలిసిందే. తెలీక ఆ వ్యక్తి వాటిని తినడంతో ప్రాణాలు కోల్పోయాడట. అందుకే.. అక్కడ గుడి పరిసరాల్లోనూ ఆ మొక్కలు ఉండటానికి వీలు లేదని, ఆ పూలను గుడిలోకి తేవద్దని నిర్ణయించారు. అసలు నిజంగానే గన్నేరు పూలు, కాయలు తింటే చనిపోతారా..? అవి అంత ప్రాణాంతకమా..? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

37

గన్నేరు  మొక్క వల్ల ఉపయోగం ఏమిటి?
గన్నేరు  మొక్కను చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో , రోడ్ల పక్కన పెంచుతారు. దీనికి ప్రధాన కారణం ఈ మొక్కలో  గాలిని శుద్ధి చేసే గుణాలు ఉండడమే. ఈ మొక్క గాలిలోని కాలుష్య కారకాలను ఫిల్టర్ చేసి మనకు స్వచ్ఛమైన గాలిని పంపుతుంది

గన్నేరు  పూల రకాలు:
అదేవిధంగా గన్నేరు మొక్కల్లో  చాలా రకాలు ఉన్నాయి. అవి ఎరుపు, పసుపు , తెలుపు. అయితే వీటిలో పసుపు రంగులో ఉండే గన్నేరు పువ్వు అత్యంత విషపూరితమైనది.

47

oleander

oleander

గన్నేరు పూలను  ఎక్కువగా దేవాలయాల్లో పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇది కూడా ఎక్కువగా శివాలయాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. దేవాలయాల్లో ఈ పువ్వును ప్రసాదంగా ఇస్తారు కాబట్టి ఆ సమయంలో తప్ప ఇతర సందర్భాల్లో మహిళలు ఈ పువ్వును పెట్టరు. అలాగే, దేవాలయాలలో తిరునీరు, కుంకుము , పొంగల్ నైవేద్యంలో ఇతర పుష్పాలతో పాటు ఈ పువ్వును కలుపుతారు.

57

oleander

oleander

గన్నేరు పువ్వును  ఆయుర్వేద వైద్యంలో అనేక విధాలుగా ఔషధంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఇది చర్మ సంబంధిత సమస్యలు , మరిన్నింటికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

67

దీని వల్ల ప్రమాదం ఏంటి..?
గన్నేరు  పువ్వులోని పసుపు రంగు మాత్రమే విషపూరితమైనది, కానీ ఏ గన్నేరు మొక్క అయినా.. ఆకులు, కాయలు మాత్రం విషపూరితమే. అందుకే వాటిని పొరపాటున కూడా నోట్లో పెట్టుకోకూడదు.

77
Oleander

Oleander

గన్నేరు కాయలను  తింటే వెంటనే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అంటే గుండె నొప్పి వస్తుంది అన్నమాట.  ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. కొందరికి మొదట వాంతులు, విరోచనాలు, మూర్ఛ, చర్మంపై దద్దుర్లు లాంటి వాటితో మొదలై... చివరకు గుండె నొప్పి వచ్చేదాకా దారితీస్తుంది. కాబట్టి.. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved