Health Tips: నిద్రతో ఆటలాడకండి.. బలవంతంగా ఆపుకొని ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి!
Health Tips: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అలవాటు పడినవారు నిద్ర ఆపుకొని మరీ దానితో టైం స్పెండ్ చేస్తున్నారు. అయితే ఇది ఎంత ప్రమాదకరమో, దాని నుంచి ఎలా బయటపడటమో చూద్దాం రండి.

Image: Freepik
సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో అందరికీ తెలిసిందే. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే ఎంత ఉపయోగమో మితిమీరి ఉపయోగించడం వల్ల అంత ప్రమాదం. ఈ విషయం తెలిసినా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు.
కేవలం చాట్ చేయటానికి, వీడియో గేమ్లు ఆడటానికి అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి నిద్రని సైతం పక్కన పెడుతున్నారు. రోజుకి కచ్చితంగా 7, 8 గంటల నిద్ర చాలా అవసరం. శరీరానికి అవసరమైన ఈ నిద్రని బలవంతంగా ఆపుకోవటం వలన గుండెపోటు మరియు గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందట.
అలాగే శరీర బరువు విపరీతంగా పెరిగిపోయి. నిద్రలేమి షుగర్ వ్యాధికి కూడా దారితీస్తుంది. అలాగే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని ప్రభావం మన జ్ఞాపక శక్తిపై కూడా పడుతుంది జ్ఞాపకశక్తి మందగించి మతిమరుపు ప్రారంభమవుతుంది.ఒత్తిడి, డిప్రెషన్, ఆంళన, తలనొప్పి వంటి మానసిక సమస్యలు సైతం తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి.
అందుకే వీటిని దృష్టిలో పెట్టుకొని తగినన్ని జాగ్రత్తలు తీసుకొని కంటి నిండా నిద్రపోండి. నిద్ర అవసరం కదా అని చెప్పి పగటిపూట నిద్రపోయి రాత్రంతా మేల్కొని కంప్యూటర్లతో కుస్తీ పట్టటం కూడా మంచిది కాదు. అందుకే తగినంత సమయం నిద్రకి కేటాయించండి. అవసరం అనుకున్నప్పుడు క్యాడ్జెట్ ని ఉపయోగించడంలో తప్పులేదు.
కానీ టైం పాస్ కోసం గ్యాడ్జెట్స్ ని ఉపయోగించడం అందుకోసం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోకండి. ప్రతి పనికి నిర్దిష్టమైన సమయం ఏర్పరచుకుంటే మీ పనులు పూర్తి చేసుకుంటూనే తగినంత సమయం నిద్రపోవచ్చు.