Sleep: రాత్రిపూట నిద్రపట్టడం లేదా..? పడుకునే ముందు ఇవి తింటే చాలు..!
పండల్లో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు, హార్మోన్లు, మన శరీరాన్ని విశ్రాంతి తీసుకునేలా చేసి, గాఢ నిద్రకు దోహదపడతాయి. ముఖ్యంగా, మీరు పడుకునే ముందు కొన్ని రకాల పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే.. హ్యాపీగా నిద్రపోవచ్చు.

రాత్రిపూట నిద్ర పట్టడం లేదా?
నిద్రలేమి అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న కామన్ సమస్య. ఫోన్ ఎక్కువగా చూడటం, పని ఒత్తిడి, సరైన సమయంలో భోజనం చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల మన నిద్ర నాణ్యతను దెబ్బతీస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మందులు ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ, అలా మందులు వాడటం ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. మందులు వాడకుండానే హ్యాపీగా నిద్రపోవచ్చు. దాని కోసం కేవలం మనకు చాలా సులభంగా దొరికే కొన్ని రకాల పండ్లు తింటే చాలు. మీరు చదివింది నిజమే.. నిద్ర నాణ్యతను మెరుగుపరిచే పండ్లు చాలానే ఉన్నాయి. పండల్లో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు, హార్మోన్లు, మన శరీరాన్ని విశ్రాంతి తీసుకునేలా చేసి, గాఢ నిద్రకు దోహదపడతాయి. ముఖ్యంగా, మీరు పడుకునే ముందు కొన్ని రకాల పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే.. హ్యాపీగా నిద్రపోవచ్చు. మరి, ఆ పండ్లు ఏంటో చూద్దామా...
1.చెర్రీస్...
చెర్రీ పండ్లు లేదా.. చెర్రీ పండ్ల జ్యూస్ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. చెర్రీ పండ్లలో మెలటోనిన్, ట్రిప్టోఫాన్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ రెండు పదార్థాలు మన శరీరంలో నిద్ర హార్మోన్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. రాత్రి పడుకోవడానికి గంట ముందు దీనిని తీసుకున్నా.. హ్యాపీగా, సంతోషంగా నిద్రపోగలరు. నార్మల్ గా కంటే గంట ఎక్కువసేపే నిద్రపోతారు.
2. అరటిపండు
అరటిపండు సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే పండు. హ్యాపీగా నిద్రపోవడానికి ఈ పండు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం , విటమిన్ B6 కండరాల నొప్పులను తగ్గించి, శరీరాన్ని నిద్ర కోసం సన్నద్ధం చేస్తాయి. ట్రిప్టోఫాన్ అనే యామినో యాసిడ్, మెదడులో సెరోటోనిన్‌గా మారి, చివరికి మెలటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిద్రకు అవసరమైన సహజ మార్గం. రాత్రి అరగంట ముందు అరటిపండు తినడం వల్ల మీకు మంచి ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.
3. పైనాపిల్
పైనాపిల్‌లో సహజంగా ఉండే మెలటోనిన్ హార్మోన్, నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని శాంతపరిచి, మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల్లో, పైనాపిల్ తినడం ద్వారా మెలటోనిన్ స్థాయిలు 266% వరకూ పెరిగినట్లు గమనించారు. ఇది గాఢ నిద్రకు అనువైన వాతావరణాన్ని కలిగిస్తుంది.
4. కివి
కివి పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C, సెరోటోనిన్ వంటి పదార్థాలు శరీరానికి విశ్రాంతి కలిగించి, నిద్రను మెరుగుపరుస్తాయి. “Sleep Quality, Fatigue, and BMI in Saudi Adults” అనే అధ్యయనంలో భాగంగా, రాత్రి పడుకునే ముందు రెండు కివి పండ్లు తిన్న వారిలో నిద్ర నాణ్యత మెరుగైనట్లు తేలింది. కివి కండరాలను సడలించి, మెదడును ప్రశాంతంగా ఉంచేలా పనిచేస్తుంది.
5. ఆపిల్
ఆపిల్స్‌లో మెలటోనిన్, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాలను శాంతింపజేసి, నిద్రను ప్రేరేపించడానికి సహాయపడతాయి. 2011లో ప్రచురితమైన NCBI జర్నల్ ప్రకారం, ఆపిల్స్‌లో ఉండే ఈ పోషకాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని నిర్ధారించారు. అధిక క్యాలరీలు లేకుండా తేలికపాటి స్నాక్‌గా కూడా ఆపిల్ తీసుకోవచ్చు. కడుపు నిండటంతో పాటు.. హ్యాపీగా నిద్రపోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
ఫైనల్ గా..
మందులు లేకుండా, సహజంగా నిద్రను మెరుగుపరచాలని చూస్తున్నవారికి పైన చెప్పిన పండ్లు చాలా ఉపయోగపడతాయి. ఇవి మంచి హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటంతో పాటు, శరీరాన్ని, మెదడును విశ్రాంతిగా ఉంచుతాయి. అయితే ఈ పండ్లను మితంగా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, సమయానికి నిద్రపోవడం వంటి అలవాట్లను మెరుగుపరుచుకుంటే హ్యాపీగా నిద్రపోగలరు.