ఈ పదార్థాలను తింటే అలాంటి రోగాలు రావడం ఖాయం.. జాగ్రత్త మరీ!
తీసుకునే ఆహార పదార్థాల (Foods) మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహార జీవన శైలిలో ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. కానీ ప్రస్తుత కాలంలో పోషక ఆహారానికి బదులుగా బయట దొరికే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలను (Illness issues) కొనితెచ్చుకున్నట్లు అవుతోంది. కనుక ఆహారపదార్థాలలో వేటిని తీసుకుంటే ప్రమాదమో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

ఇంటి ఇల్లాలుగా కుటుంబానికి ఆరోగ్యకరమైన పదార్థాలను వండి వడ్డించడం, ఏ ఆహార పదార్థాలు తింటే హాని (Harm) కలుగుతుందో తెలియజేయడం మీ బాధ్యత. తీసుకునే ఆహార పదార్థాలపై సరైన అవగాహన (Awareness) కల్పించాలి. కనుక ఇప్పుడు తినకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
వేపుళ్లు: తాజాగా ఒక సంస్థ వేపుళ్లు (Fries) ఎక్కువగా తినే వారిపై ఒక పరిశోధన చేపట్టింది. అయితే వీటిని ఎక్కువగా తినే వారిలో సాధారణ జబ్బులతో (Common diseases) పాటు ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు.
పిజ్జాలు: ప్రస్తుత కాలంలో పిజ్జాలు (Pizzas) తినే వారి సంఖ్య అధికంగా పెరిగిపోతోంది. ఇందులో మళ్లీ మళ్లీ శుద్ధి చేసిన పిండి, ప్రాసెస్ చేసిన ఆహారంతో తయారయ్యే పిజ్జాలు అధిక కేలరీలను (High calories) కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్: చిప్స్ (Chips), ఫ్రెంచ్ ఫ్రైస్ (French fries) లను వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే పర్వాలేదు. కానీ ఎక్కువగా తింటుంటే వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఫాస్ట్ ఫుడ్స్: చాలామంది ఫాస్ట్ ఫుడ్స్ (Fast Foods) ను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిలో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఫలితంగా అజీర్తి (Indigestion), కడుపునొప్పి వంటి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. కనుక వీటికి దూరంగా ఉండటమే మంచిది.
బ్రెడ్: చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా మైదాతో తయారుచేసిన బ్రెడ్ ను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే బ్రెడ్ తయారీ కోసం ఉపయోగించే మైదా ఆరోగ్యానికి మంచిది కాదు. మైదాతో (Maida) తయారు చేసిన వైట్ బ్రెడ్ (White bread) ను తీసుకుంటే మధుమేహం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్: రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ (Readymade Fruit Juice) లలో ఉపయోగించి ప్రిజర్వేటివ్ లు, ఎక్కువ తీపిదనం (Sweetness) ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
గ్రిల్డ్, బ్రాయిల్డ్: ఎక్కువ మంట మీద కాల్చి, వేయించిన గ్రిల్డ్, బ్రాయిల్డ్ పదార్థాలను తినడం మంచిది కాదు. వీటి కారణంగా క్యాన్సర్ (Cancer) వచ్చే అవకాశం ఉంటుంది. కనుక తక్కువ మంట మీద ఉడికించిన ఆహార పదార్థాలను (Cooked foods) తీసుకోవడం మంచిది.