Health Tips: ఆరోగ్యానికి ఆకుకూరలు మంచివేగా.. మరి వర్షాకాలంలో ఎందుకు తినకూడదంటే?
Health Tips: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కచ్చితంగా భోజనంలో ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోమంటారు డాక్టర్లు. కానీ అదే ఆకుకూరలు వర్షాకాలంలో తినకూడదంట ఎందుకో చూద్దాం.
ఎంత ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివైనా వర్షాకాలంలో వాటిని కాస్త దూరం పెట్టమన్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే సాధారణంగా ఆకుకూరలు తక్కువ ఎత్తులో పండుతాయి అంటే ఆ మొక్కలు ఆకులు భూమికి దగ్గరగా ఉంటాయి. దానివల్ల వర్షం పడినప్పుడు ఎక్కడెక్కడ నుంచొ కొట్టుకొచ్చిన నీళ్లు వాటికి తాకడం లేదా సమీపంలోకి రావటం వల్ల అవి కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది.
ఆ నీళ్లలోని సూక్ష్మజీవులు ఆకులని చేరుతాయి. అదే సమయంలో ఆకుకూరల మీద పురుగు పుట్ర కూడా వాటిని అతుక్కుని ఉండిపోతాయి. అలాగే ఆకుకూరల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం అయ్యేందుకు కాస్త సమయం పడుతుంది. మామూలుగానే వర్షాకాలంలో మనకి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది.
కాబట్టి ఆకుకూరల్ని దూరం పెట్టడం మంచిది. అలాగే కలర్ ఇంజక్షన్స్ వేయటం వల్ల ఆకుకూరలకు మరింత ముదురు రంగు వస్తాయి ఇవి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి ప్రేగులను బలహీన పరుస్తాయి. దానివల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది.
చల్లని వాతావరణం లో ఆకుకూరలు ఉంచినప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తాయి కానీ వాటిని నిల్వ చేసే ప్రదేశం శుభ్రంగా లేకపోతే ఆకుకూరలు కలుషితం అవుతాయి దీని వలన ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అలాగే వర్షాకాలంలో ఆకుకూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.
ఆకుల మధ్య పరిశీలించినట్లయితే బ్యాక్టీరియా దాగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆకుకూరలని పక్కన పెట్టడం మంచిది. ఆకుకూరలు కచ్చితంగా తినవలసిన పరిస్థితి వచ్చినట్లయితే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆకుకూరలని కాసేపు అలాగే వదిలేయండి.
తర్వాత వాటిని ఎక్కువ శ్రద్ధ తీసుకొని శుభ్రపరచిన తరువాతే వంటకి ఉపయోగించండి. అలాగే వర్షాకాలంలో ఎట్టి పరిస్థితులలోనూ ఆకుకూరలు కర్రీ పాయింట్ల నుంచి తెచ్చుకోవద్దు. మామూలుగానే వారు క్లీనింగ్ తక్కువగా చేస్తారు ఈ వర్షాకాలంలో జీర్ణ సమస్యలు తలెత్తటం, స్టమక్ ఇన్ఫెక్షన్ కి గురికావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి.