MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • వీటిని తింటూ నీళ్లను తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..

వీటిని తింటూ నీళ్లను తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..

శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీటిని తాగాలని డాక్టర్లు, ఆరోగ్య  నిపుణులు చెబుతుంటారు. నిజమే మన శరీరానికి నీరు చాలా చాలా అవసరం. ఇదే మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. నీటిని పుష్కలంగా తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. అయితే..
 

R Shivallela | Updated : Oct 15 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

మన శరీరానికి నీరు చాలా చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు బతకగలుగుతాడు. కానీ నీరు లేకుండా మాత్రం బతకలేడని చెప్తుంటారు. వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. 
 

26
Image: Getty Images

Image: Getty Images

రోజూ 8 నుంచి 9 గ్లాసుల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. రోజూ నీటిని పుష్కలగా తాగడం వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొన్ని ఆహారాలను తిన్న తర్వాత నీటిని తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో నీటిని తాగడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని ఆహారాలను తిన్న తర్వాత నీటిని ఎట్టి పరిస్థితిలో తాగకూడదు. ఇలా తాగితే గ్యాస్, ఎసిడిటీతో పాటుగా జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే ఎలాంటి ఆహారాలను తిన్న తర్వాత నీటిని తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

36
Asianet Image

అరటి పండు 

అరటిపండ్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే అరటిపండ్లను తిన్న తర్వాత నీళ్లను ఎక్కువగా తాగితే కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి అరటిపండ్లను తింటున్నప్పుడు లేదా  తర్వాత నీటిని తాగకండి. 

46
Asianet Image

సిట్రస్ పండ్లు

నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో జ్యూసినెస్ ఉంటుంది. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటున్నప్పుడు, తిన్న తర్వాత నీటిని తాగకూడదు. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. 

56
Asianet Image

పెరుగు

పెరుగు పాలతో తయారయ్యే ఒక పదార్థం. ఇది మన జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మీ గట్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు తిన్న వెంటనే నీళ్లను తాగడం వల్ల ఈ ప్రోబయోటిక్స్ నశిస్తాయి.

66
Image: Getty

Image: Getty

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్ ను తింటున్నప్పుడు చాలా మంది నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. అయితే స్పైసీ ఫుడ్ ను తింటున్నప్పుడు లేదా తిన్న తర్వాత నీటిని తాగితే కడుపు చికాకు పెరుగుతుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. 

R Shivallela
About the Author
R Shivallela
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories