MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • ఈ చిట్కాలు పాటిస్తే ఆస్తమా రోగులు కూడా దీపావళి ఆనందంగా చేసుకోవచ్చు

ఈ చిట్కాలు పాటిస్తే ఆస్తమా రోగులు కూడా దీపావళి ఆనందంగా చేసుకోవచ్చు

దీపావళిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు కదా.. కాని ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్న వాళ్లు మాత్రం దీపావళి రోజు చాలా భయపడుతూ ఉంటారు. దీపాలు పెట్టాలన్నా, టపాసులు పేల్చాలన్నా భయపడతారు. టపాసుల నుంచి విడుదలయ్యే హానికారక పొగ వల్ల వారి లంగ్స్ మరింత దెబ్బతింటాయి. దీంతో హెల్త్ ప్రాబ్లమ్ పెరుగుతుందని ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆస్తమా రోగులు కూడా దీపావళిని ఆనందంగా, ఎటువంటి భయాలు లేకుండా జరుపుకోవచ్చు. అవేంటో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Oct 27 2024, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశ వ్యాప్తంగా దీపావళిని ఆనందంగా జరుపుతారు. దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో అయిదు రోజులు పండుగలా దీపావళి చేస్తారు. ఇండియాతో పాటు నేపాల్ దేశంలోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అసలు దీపావళి అంటే దీపాలు వెలిగించడం. కాని ఈ సంప్రదాయం కాలానుగుణంగా మారి దీపావళి అంటే టపాసులు పేల్చడంలా మారిపోయింది. ఇది ప్రతి సంవత్సరం విపరీతంగా మారుతూ పొల్యూషన్ కి కారణమవుతోంది. బాణసంచా వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోంది. విషపూరిత పొగ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ నానా బాధలు పెడుతుంటాడు. ఆ బాధలు తట్టుకోలేక ప్రజలంతా  శ్రీకృష్ణుడు వేడుకుంటారు.  తమను రక్షించమని మొర పెట్టుకుంటారు. అయితే మరణం లేకుండా వరం పొందిన నరకాసురుడిని ఆయన తల్లి అయిన భూదేవి మాత్రమే చంపగలదు. ద్వాపర యుగంలో ఆమె సత్యభామగా పుట్టి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకుంటుంది. నరకాసురుని చంపే బాధ్యత తీసుకున్న శ్రీకృష్ణుడికి సత్యభామే నరకాసురిని తల్లి అని తెలుసు. అందుకే నరకాసుడితో యుద్ధానికి సత్యభామను కూడా వెంట తీసుకెళతారు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేక సొమ్మసిల్లినప్పుడు సత్య భామ బాణాలు వేసి నరకాసురుడిని అంతం చేస్తుంది. అతడి పీడ వదిలినందుకు గాను మరుసటి రోజు ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి దీపావళి చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

 

35

అయితే త్రేతాయుగంలోనూ దీపావళి పండగ జరుపుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు రావణాసురుడిని యుద్ధంలో ఓడించి అంతం చేసిన తర్వాత ప్రజలు ఆయన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగించి దీపావళి చేసుకున్నారని కొందరు పండితులు చెబుతున్నారు. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని తొలగించేందుకు దీపాలు వెలిగించి కాంతిని వెదజల్లి దీపావళి జరుపుకొనేవారు. ఇది కాలక్రమేణ మార్పులు చెంది దీపావళి అంటే టపాసులు, బాణసంచా కాల్చడమేనన్నట్లుగా మారిపోయింది. అసలు నరకాసురుడు అనే ఈ రాక్షసుడు  కృతయుగంలోనూ వరాహ స్వామికి, భూదేవికి జన్మించాడని పురాణాల్లో ఉంది. 

 

45

దీపావళి సమయంలో ఆస్తమా రోగులకు ఆస్తమా తీవ్రమవుతుంది. ఎందుకంటే దీపావళి బాణసంచా వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. పొగలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సీసం, రాగి, సోడియం, పొటాషియం వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. అలెర్జీలకు కారణమవుతాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పెరుగుతాయి. 

ఆస్తమా రోగులకు దీపావళి జాగ్రత్తలు

1. టపాసులు కాల్చినప్పుడు ఏర్పడే పొగ, రసాయనాలు శ్వాస సంబంధిత సమస్యలను పెంచుతాయి. దీన్ని నివారించడానికి వాటిని దూరంగా ఉంచడం మంచిది.

2. బయటకు వెళ్లే అవసరం ఉంటే మంచి నాణ్యమైన మాస్క్ (N95) ధరించడం ద్వారా వాయుకాలుష్యం నుండి రక్షణ పొందవచ్చు.

3. మీ శ్వాస మార్గాలను తేమగా ఉంచడానికి నీరు ఎక్కువగా తాగండి. 

4. జీర్ణ సమస్యలను కలిగించే ఆస్తమాను తీవ్రతరం చేసే కొవ్వు, మసాలా ఆహారాలను మానుకోండి.

55

5. స్మోకింగ్(ధూమపానం) మానుకోండి.

6. వెచ్చగా ఉండే దుస్తులు ధరించండి.

7. డాక్టర్ సూచించిన ఇన్హేలర్లు లేదా ఇతర ఆస్తమా మందులను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.

8. AC లేదా ఫ్యాన్ల కింద నేరుగా కూర్చోవద్దు.

9. దీపావళికి ముందు, తర్వాత మీ వైద్యుడిని సంప్రదించండి.

10. దుమ్ము, పొగ ఉన్న వాతావరణాలకు దూరంగా ఉండండి.  శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసే అలవాటు చేసుకోవడం ద్వారా మీరు శ్వాస పై నియంత్రణను పెంచుకోవచ్చు.

ఈ చిట్కాలను పాటిస్తే, ఆస్తమా రోగులు సురక్షితమైన, ఆనందకరమైన దీపావళిని ఆస్వాదించవచ్చు.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved