దీపావళి 2023: పండుగకు మీరు ఆరోగ్యంగా, చూడచక్కగా కనిపించాలంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి
Diwali 2023: దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పండుగకు కొత్త బట్టలు వేసుకుని ఇంటి నిండా దీపాలను వెలిగించి, టపాసులను కాల్చుతారు. అలాగే రకరకాల వింధు భోజనాలను కూడా ఆరగిస్తారు. అయితే ఈ పండుగకే కాదు పండుగ తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాల్సిందే. అవేంటంటే..
ఈ నెల 12న మనం దీపావళి పండుగను జరుపుకోకున్నాం. పండుగకు కొన్ని రోజులే ఉంది. కాబట్టి ఇప్పటికే పండుగకు అన్నీ సిద్దం చేసి పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తీరొక్క స్వీట్లను, పిండి వంటకాలను కూడా తయారుచేస్తారు. ఇవి లేకుండా పండుగను ఆస్వాధించడం కష్టమే. కానీ తీపిని, వేయించిన, కారంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడతారు. ఇంతేకాదు వీటన్నింటీ ఓవర్ గా తింటే మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మరి పండుగను ఆస్వాధించాలనుకుంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డైట్ ప్లాన్
మిగతా రోజుల్లో డైట్ ను ఫాలో అయ్యి.. పండుగల సమయంలో దీన్ని స్కిప్ చేసేవారున్నారు. కానీ పండుగల సమయంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తినాలి, ఎలాంటి పానీయాలను తాగాలి, వీటిని ఎంత మొత్తంలో తీసుకోవాలి అనే విషయంలో కూడా ప్లాన్ చేసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం మీరు తినే ఫుడ్ ను మూడు నుంచి నాలుగు భాగాలుగా విభజించండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీపి, వేయించిన ఆహారాలను తినడం మానుకోండి. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తినండి. ఇక మధ్యాహ్నం పూట మీ ప్లేట్ లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. రాత్రి పూట ఎంచక్కా డిన్నర్ ను తినండి. అయితే సాయంత్రం మీరు హెవీగా తిన్నట్టైతే డిన్నర్ ను స్కిప్ చేయండి.
హైడ్రేట్ గా ఉండండి
చలికాలం షురూ అయ్యింది. చలివల్ల మనకు పెద్దగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది నీళ్లను తాగరు. కానీ ఏ కాలమైనా సరే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నీటిని పుష్కలంగా తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. వాటర్ మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అందుకే ఈ సీజన్ లో కూడా నీటిని పుష్కలంగా తాగడండి. మీకు తెలుసా ఇది మీ ఆకలిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
Millets
చిరుధాన్యాలు
దీపావళికి మీరు చేసే వంటకాల్లో చిరుధాన్యాలు చేర్చండి. ఎందుకంటే ఈ చిరుధాన్యాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్యాస్, ఎసిడిటీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. మీకు తెలుసా? ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. అందుకే మీరు ఈ పండుగకు చిరుధాన్యాలు తిన్నారంటే ఈ సమస్యలనేవే రావు. ప్రస్తుత కాలంలో చాలా మంది కూరగాయలు, స్వీట్ల తయారీలో కూడా చిరుధాన్యాలను ఉపయోగిస్తున్నారు.
చురుగ్గా ఉండండి
పండుగైనా సరే రోజులాగే వ్యాయామం చేయండి. కొద్దీ సేపైనా సరే కానీ పండుగ రోజు కూడా ఎక్సర్ సైజ్లు చేయండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ను మిస్ అయితే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే యోగా లేదా వాకింగ్ ఇలా ఏదో ఒకటి చేయండి. వ్యాయామం అదనపు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మిమ్మల్ని హుషారుగా చేస్తుంది.