MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Fitenees: పొట్ట ఉన్నంత మాత్రాన అనారోగ్యంగా ఉన్నట్లు కాదా.? సోషల్‌ మీడియా చెప్పేదంతా నిజమేనా?

Fitenees: పొట్ట ఉన్నంత మాత్రాన అనారోగ్యంగా ఉన్నట్లు కాదా.? సోషల్‌ మీడియా చెప్పేదంతా నిజమేనా?

Health Facts: పొట్ట ఉంటే అనారోగ్యంగా ఉంటారని మనలో సాధారణంగా ఉండే భావన. స్లిమ్‌గా ఉంటే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నాడని అనుకుంటారు. అయితే ఇందులో నిజంగానే నిజం ఉందా.? జిమ్‌లో వ్యాయామాలు చేసే వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లా.? ఇలాంటి ఆసక్తికర విషయాలపై అమర్‌నాథ్‌ వాసిరెడ్డి వారి ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన పోస్ట్‌లోని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Amarnath Vasireddy
Published : Feb 01 2025, 08:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

"పొట్ట అనారోగ్యం కాదు .. స్లిమ్ గా ఉంటే ఆరోగ్యం అని కాదు ". "జిమ్‌ లో వ్యాయామం కేవలం సినీ స్టార్స్ కు మాత్రమే . జిమ్‌ చేస్తే ఆరోగ్యం ఫట్ . " "వాకింగ్ వల్ల ఆరోగ్యం నాశనం  . వాకింగ్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి ". "నోటికి  ఏది రుచి అనిపిస్తే అది తినండి . ఇది తినొద్దు అది తిన్నొద్దు అనే వారి మాట పట్టించుకోకండి " మెడికల్ డిగ్రీ పొందిన  కొంత మంది బ్రోకర్స్ .. ఫార్మా ఏజెంట్స్ యూ ట్యూబ్  చానెల్స్ ఎక్కి వాగిన మాటలు ఇవి.

ఇలాంటివి ఇటీవల బాగా సర్క్యూలేట్ అవుతున్నవి. వీరు...  తాము చెప్పింది మెడికల్ సైన్స్ అని నమ్మబలుకుతున్నారు. పొట్ట ఉంటే అనారోగ్యం అని ఏ మెడికల్ బుక్ లో లేదు అని ఒకడు .. వాకింగ్ చేస్తే చస్తారు .. లేని రోగాలు వస్తాయి అని ఇంకొకడు .. ఇలా రెచ్చి పోతున్నారు .
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

వీటి గురించి మెడికల్ బుక్స్ ఏమంటున్నాయి ?

పొట్ట అనారోగ్యం - విసెరల్ ఫాట్ అండ్ హెల్త్ .. ఇరిసిన్ అండ్  బొస్ట్రోమ్ .. నేచర్ రివ్యూస్ ఎండోక్రైనాలజీ మెడికల్ పత్రిక లో ప్రచురణ . జిమ్ అందరికీ అవసరం అలాగని నేరుగా వెళ్లి బరువులు ఎత్తేసి సమస్యలు తెచ్చుకోవడం కాదు . ప్రతి దానికీ ఒక పద్ధతి ఉంటుంది. ఫిసికల్ ఆక్టివిటీ అండ్ హెల్త్ .. మోర్బీడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీ రిపోర్ట్. నడక ఆరోగ్యం (తీవ్ర మోకాళ్ళ నొప్పులు లాంటి ఆరోగ్య సమస్యలు వున్నవారికి తప్పించి) వాకింగ్ అండ్ ప్రైమరీ ప్రివెన్షన్ ... అమెరికన్ హార్ట్ అసోసియేషన్ - 2013 .

33
obesity

obesity

హెల్తి డైట్ - న్యూట్రిషన్ అండ్ హెల్త్ .. అకాడమీ అఫ్ న్యూట్రిషన్ అండ్ డియాబెటిక్స్.. 2020. ఇది కేవలం రుజువు కోసం . ఇలాంటి పరిశోధనలు వందల్లో . ప్రతి మెడికల్ బుక్ లో ఇవి ఉంటాయి . ఇలా వాగిన వారు... ఎవడు చూస్తాడులే అని బరితెగించిన రకం .. లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కాపీ కొట్టి పాస్ అయ్యిన రకం...  అయ్యి ఉండాలి. చివరిగా ఒక మాట .
మెడికల్ కౌన్సిల్  అధ్యక్షుడు కొన్ని రోజుల క్రితం చెప్పిన మాట .. మన దేశం లో ఇప్పుడు నిజమైయైన డాక్టర్స్ తగ్గిపోతున్నారు. స్టార్ ఆసుపత్రుల ఏజెంట్స్ గా చాల మంది డాక్టర్స్ మారిపోతున్నారు.

ప్రసార మాధ్యమాల్లో స్టార్ ఆసుపత్రుల సారథ్యంలో ప్రసారమయ్యే వాటిలో నూటికి తొంబై శాతం వక్రీకరణలు .. అర్ధ సత్యాలు .. అశ్వత్థామ అథః కుంజరః .. టైప్‌లో ఉంటాయి. జనాల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహను చంపడం .. అనారోగ్య పద్ధతులను అలవాటు చెయ్యడం.. భయపెట్టి టెస్ట్‌లు చేసుకొనేందుకు ఆసుపత్రులకు రప్పించుకోవడం.. వచ్చాక వామ్మో నీకు ఇదిగో షుగర్ 142 వుంది .. 140 దాటితే చస్తావు ఇదిగో రోజుకు యాభై మాత్రలు మింగు అని చెప్పి ఆ బకరాను శాశ్వత ఏటీఎంగా మార్చుకోవడం. ఇదీ నడుస్తున్న చరిత్ర. ఎక్కడో ఒక్కరో ఇద్దరో నిజాయితీ డాక్టర్స్ ఉన్నారు.. వారికి క్షమాపణలతో .. 

అమర్‌నాథ్‌ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌ పోస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved