MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • ఆవు పాలు, గేదె పాలు.. రెండింటిలో ఏవి తాగితే మంచిదో తెలుసా?

ఆవు పాలు, గేదె పాలు.. రెండింటిలో ఏవి తాగితే మంచిదో తెలుసా?

కొంతమంది ఆవు పాలను తాగితే.. మరికొంతమంది గేదె పాలను తాగుతుంటారు. కానీ ఈ రెండింటిలో ఏ పాలను తాగితే మంచిది? ఏ పాలను ఎవరు తాగాలి? ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 14 2024, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే పాలు మన రోజువారి ఆహారంలో ఒక భాగమైపోయాయి. ప్రతిరోజూ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాలను తాగుతుంటారు. పాలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పాలలో విటమిన్ డి, కాల్షియంలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.

అయితే కొంతమంది ఆవు పాలను తాగితే, మరికొంతమంది గేదె పాలను తాగుతుంటారు. అయితే ఈ రెండు రకాల పాలలో ఏవి మంచివి అని జనాలకు డౌట్ వస్తుంటుంది. అసలు ఈ రెండు పాల మధ్య తేడా ఏంటి? మన ఆరోగ్యానికి ఏ పాలు ఎక్కువ మంచి చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

ఆవు, గేదె పాల మధ్య ఉన్న తేడా

గణాంకాల ప్రకారం.. చాలా మంది ఆవు పాలను తాగడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే తేలికగా ఉంటాయి. అంటే ఆవు పాలు చాలా సులువుగా జీర్ణం అవుతాయి. అదే గేదె పాలైతే చిక్కగా, మందంగా ఉంటాయి. అందుకే ఈ పాలను టీ, కాఫీల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. 

ఏ పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి? 

ఆవు పాలను, గేదె పాలను రెండింటిని తాగడానికే ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు పాల మధ్య కొన్ని తేడాలు ఉంటాయి.  ఆవు, గేదె రెండు పాలలో ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఈ ఆవు పాలు కంటే గేదె పాలలోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆవు పాలలో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పాలు పల్చగా ఉంటాయి. 
 

45

అదే గేదె పాలు అయితే చిక్కగా, క్రీమీగా ఉంటాయి. ఆవు పాలకంటే గేదె పాలలోనే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. గేదె పొటాషియం,  కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే ఆవు పాలలో విటమిన్లు మెండుగా ఉంటాయి. ఆవు పాలు కొద్దిగా పసుపు, తెలుపు రంగులో ఉంటే.. గేదె పాలు క్రీమీ తెలుపులో ఉంటాయి. 

ఆరోగ్యానికి ఏ పాలు మంచివి? 

ఆవు, గేదె ఈ రెండు పాలలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఈ రెండు రకాల పాలలో కాల్షియం, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే వీటి  పరిమాణంలో కొంత తేడా ఉంటుంది. అంటే 100 మి.లీ ఆవు పాలలో సుమారుగా 3.2 గ్రాముల ప్రోటీన్క కంటెంట్ ఉంటుంది. అదే గేదె పాలలో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
 

55

అలాగే ఆవు పాలలో కొవ్వు 4.4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 4.9 గ్రాములు, కాల్షియం 118 మి.గ్రాములు ఉంటాయి. ఇకపోతే గేదె పాలలో కొవ్వు 6.6 గ్రాములు, కార్భోహైడ్రేట్లు 8.3 గ్రాములు, కాల్షియం 121 మి.గ్రాములు ఉంటాయి. ఈ రెండు రకాల పాలలో లాక్టోస్ ఉంటుంది. ఇది ఆవు పాలలో 4.28 గ్రాములు ఉంటే, గేదె పాలలో 4.12 గ్రాములు ఉంటుంది. 

గేదె పాలలో పొటాషియం, బీటా-లాక్టోగ్లోబులిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే ఆవు పాల కంటే గేదె పాలలోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది.

ఈ పాలు హై బీపీ, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా మంచివి. ఇకపోతే ఆవు పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడానికి, గుండెను  ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved