Weight Loss: వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే.. ఈ తప్పులు మాత్రం చేయకండి!
ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నవారే. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా బరువు మాత్రం తగ్గరు. వెయిట్ లాస్ జర్నీలో చేసే కొన్ని తప్పులే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. అవెంటో చూసేయండి.

అధిక బరువు చాలా అనారోగ్యాలకు దారితీస్తుంది. చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ ఫాలో అవుతారు. యోగా, వ్యాయామం, వాకింగ్ చేస్తారు. ఇలా ఎన్ని చేసినా కొన్నిసార్లు బరువు మాత్రం తగ్గరు. ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల బరువు తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
ఆహారపు అలవాట్లు:
ఆహారపు అలవాట్లు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వ్యాయామం 20% అయితే, ఆహారపు అలవాట్లు 80% బరువు తగ్గడంలో పాత్ర పోషిస్తాయి. నిద్ర కూడా చాలా ముఖ్యం.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. 5 రకాల పోషకాలున్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. తప్పకుండా చక్కెరను తగ్గించాలి. స్వీట్లు, కాఫీ, టీ లాంటివి తగ్గించాలి. చక్కెర లేకుండా టీ, కాఫీ తాగొచ్చు. ఎక్కువగా కొవ్వు, ఉప్పు ఉన్న ఫుడ్ తీసుకోకూడదు.
ఏ ఆహారం తినాలి?
ఫుడ్ కి సంబంధించినవి తీసుకునేటప్పుడు వాటి లేబుల్స్ చదవండి. ఎరుపు రంగు గుర్తు ఉన్న ఆహారాలను వదిలి, ఆకుపచ్చ రంగు గుర్తు ఉన్న ఆహారాలను ఎంచుకోండి.
చక్కెర పానీయాలు వద్దు
బరువు తగ్గాలనుకుంటే చక్కెర కలిసిన డ్రింక్స్ తాగకండి. నీటిలో నిమ్మకాయ లేదా నారింజ పండ్లు వేసి తాగొచ్చు. చక్కెర లేని తాజా పండ్ల రసాలు తాగొచ్చు. రోజూ 2.5 లీటర్ల నుంతి 3 లీటర్ల నీరు తప్పకుండా తాగాలి.
స్నాక్స్:
ఖాళీ సమయంలో తినే స్నాక్స్ తగ్గించాలి. నూనెలో వేయించిన ఆహారాలు ఆరోగ్యానికి, ముఖ్యంగా బరువు తగ్గడానికి మంచిది కాదు. వాటిని తగ్గించాలి.
వ్యాయామం:
రోజూ యాక్టివ్ గా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోకూడదు. వారంలో 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాలు అయినా వాకింగ్ చేయాలి. లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కాలి.
మానసిక ఒత్తిడి వద్దు
మానసిక ఒత్తిడి ఉంటే బరువు తగ్గడం కష్టం. మానసిక స్థితిని మెరుగుపరుచుకుని సంతోషంగా ఉండటం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగితే కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయి, బరువు తగ్గడం ఆలస్యం అవుతుంది.
ఆటలు ఆడటం
ఏదైనా ఆటను ఇష్టపడి ఆడితే, రోజూ దాన్ని కొనసాగించండి. బ్యాడ్మింటన్, వాలీబాల్ లాంటి ఏదైనా ఆటను స్నేహితులతో ఆడండి.
గట్టి నిద్ర
రోజూ 8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. మీ నిద్ర సమయం తక్కువైతే బరువు పెరిగే అవకాశం ఉంది. సరైన నిద్ర బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది. పగటిపూట వ్యాయామం చేయడం వల్ల రాత్రి నిద్ర బాగుంటుంది.
బరువు తగ్గడానికి చేయాల్సినవి:
1). ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి
2). నూనె పదార్థాలు తగ్గించాలి
3). రోజూ వాకింగ్ చేయాలి
4). వారంలో 4 నుంచి 5 రోజులు వ్యాయామం చేయాలి
5). నీళ్లు తాగాలి
6). ఉదయం టిఫిన్ తినాలి
7). విటమిన్ 'డి' ఆహారాలు తీసుకోవాలి
8). స్వీట్లు తగ్గించాలి
9). బాగా నిద్రపోవాలి
10). మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.