ముదురు రంగు మూత్రం, అలసట, బలహీనత వంటి సమస్యలున్నాయా? జాగ్రత్త అవి క్యాన్సర్ లక్షణాలు కొవొచ్చు..!
ఏ రకమైన క్యాన్సర్ అయినా సరే దాన్ని వీలైనంత తొందరగా గుర్తించాలి. లేదంటే ప్రాణాల మీదికి వస్తుంది. అలాగే మూత్రపిండాల క్యాన్సర్ ఉంటే మీ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. వాటిని గమనిస్తే మీరు ఈ సమస్యకు వీలైనంత తొందరగా చికిత్స తీసుకోవచ్చు.
kidney cancer
భారతదేశంలో కిడ్నీ కేన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మూత్రపిండాలు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. కిడ్నీ క్యాన్సర్ అనేది మూత్రపిండాల నుంచి ఉత్పన్నమయ్యే ఒక రకమైన క్యాన్సర్. దీన్నే మూత్రపిండ కణ క్యాన్సర్ (ఆర్సిసి) అని కూడా పిలుస్తారు.
స్మోకింగ్, జెనెటిక్స్, ఊబకాయం, ఆల్కహాల్ మూత్రపిండాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 40 ఏండ్లు దాటిన వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి మూత్రపిండాల క్యాన్సర్ బారిన పడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మూత్రంలో రక్తం
మూత్రపిండాల క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి మూత్రంలో రక్తం రావడం. అవును మీకు మూత్రపిండాల క్యాన్సర్ ఉంటే మీ మూత్రం పింక్, ఎరుపు లేదా ముదురు రంగులో వస్తుంది. అలాగే మూత్రంలో రక్తం కూడా ఉంటుంది.
kidney cancer
పొత్తికడుపులో కణుపులు
మూత్రపిండాల క్యాన్సర్ ఉంటే పొత్తికడుపులో కణితులు అవుతాయి. ఇది కణితి పెరుగుదలకు సంబంధించినది కావొచ్చు. మూత్రపిండాల క్యాన్సర్ కొన్నిసార్లు పొత్తికడుపులో కణితులు లేదా మంటను కలిగిస్తుంది. ఇది మూత్రపిండాల పరిమాణం లేదా కణితులు ఉండటం వల్ల వస్తుంది.
kidney cancer
అలసట, బలహీనత
అలసట, బలహీనతలు కూడా మూత్రిపండాల క్యాన్సర్ లక్షణాలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిరంతర అలసట, బలహీనత మూత్రపిండాల క్యాన్సర్ తో ముడిపడి ఉన్నాయి.
kidney cancer
రక్తపోటు
మూత్రపిండాల క్యాన్సర్ కొన్నిసార్లు రక్తపోటును నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఒక వేళ మీకు మూత్రపిండాల క్యాన్సర్ వస్తే మీ రక్తపోటు పెరుగుతుంది.
రక్తహీనత
మూత్రపిండాల క్యాన్సర్ రక్తహీనత (ఎర్ర రక్త కణాల లోపం) కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అలసట, బలహీనత, పాలిపోయిన చర్మం రంగుకు కారణమవుతుంది.