మూత్రం లీక్ అవుతోందా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!
మగవారితో పోలిస్తే ఈ సమస్య ఎక్కువగా ఆడవారికే ఉంటుంది. కానీ మూత్రం ఆపుకోలేకపోవడానికి, లీక్ కావడానికి ఒక అనారోగ్య సమస్యే కారణమంటున్నారు నిపుణులు.

మూత్రాన్ని ఆపుకోలేకపోవడం ఆడవారికి ఒక సర్వసాధారణ సమస్య అని నిపుణులు అంటున్నారు. ఇది మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువగా వస్తుంది. బలహీనమైన కటి ఫ్లోర్ కారణంగానే ఇలా మాత్రాన్ని ఆపుకోలేకపోతుంటారని నిపుణులు అంటున్నారు. కటి ఫ్లోర్ అనేది మూత్రాశయం, గర్భాశయం, ప్రేగుకు మద్దతునిచ్చే కండరాల సమూహం. ఈ కండరాలు బలహీనపడినప్పుడు అవి ఇకపై ఈ అవయవాలకు సరిగ్గా మద్దతునివ్వవు. దీంతో మూత్రాన్ని ఆపుకోలేకపోతుంటారు. బలహీనమైన కటి కండరాలను సూచించే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల ప్రకారం.. వ్యాయామం చేసేటప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వేటప్పుడు మూత్రం లీక్ కావడం అంటే మీ కటి ఫ్లోర్ చాలా బలహీనంగా ఉందని అర్థం. కటి ఫ్లోర్ కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు ఇవి మీ మూత్రాశయానికి సరిగ్గా మద్దతునివ్వవు. ఇది మూత్రాశయంపై ఒత్తిడి చేసినప్పుడు మూత్రం లీక్ అవుతుంది.
వాయువును లేదా మలాన్ని ఆపుకోలేకపోవడం
కటి ఫ్లోర్ కండరాలు పురీషనాళానికి కూడా మద్దతునిస్తాయి. అయితే ఇవి బలహీనంగా ఉంటే వాయువు, మలాన్ని కొద్దిసేపు కూడా ఆపుకోలేరు. అలాగే యోనిలో టాంపోన్ లు నిలబడకపోతే కూడా కటి ఫ్లోర్ బలం తగినంతగా లేదని అర్థం చేసుకోవాలి.
సమయానికి బాత్ రూం కి వెళ్లకపోవడం
నిపుణుల ప్రకారం.. మీరు బాత్ రూం కు పరిగెత్తినా.. సమయానికి చేరుకోక అది మధ్యలోనే లీక్ అయితే మీ కటి ఫ్లోర్ బలహీనంగా ఉన్నట్టేనంటున్నారు నిపుణులు. కటి ఫ్లోర్ కండరాలు మూత్రాశయాన్ని నియంత్రించడానికి, మూత్రాన్ని పట్టి ఉంచడానికి బాధ్యత వహిస్తాయి. కానీ అవి బలహీనంగా ఉన్నప్పుడు మీరు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపలేరు.
యోనిలో స్పర్శ కోల్పోవడం
కటి ఫ్లోర్ కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు అవి యోనిలోని అనుభూతిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది భావప్రాప్తిని పొందడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే లైంగిక ఆనందాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
యోని మొదట్లో బరువుగా లేదా ఉబ్బినట్టుగా అనిపించడం
కటి ఫ్లోర్ కండరాలు గర్భాశయం, యోనికి సరిగ్గా మద్దతునివ్వకపోవడం, యోని మొదట్లో చర్మం ఉబ్బినట్టుగా అనిపిస్తే మీ కటి ఫ్లోర్ కండరాలు బలహీనంగా ఉన్నట్టేనంటున్నారు నిపుణులు.
చివరగా..
చివరగా ఈ ఈ సంకేతాలలో మీలో ఏ ఒక్కటి కనిపించినా కటి ఫ్లోర్ కండరాలు బలహీనంగా ఉన్నట్టేనని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. కటి ఫ్లోర్ వ్యాయామాలు, జీవనశైలి మార్పులు లేదా కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరపడొచ్చు.