బ్రాకు సంబంధించిన ఈ అపోహలను మీరు కూడా నమ్ముతారా?
ఆడవారు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మేకప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ఆడవారు బట్టల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కారు. ముఖ్యంగా బ్రా విషయంలో వీరు ఎన్నో అపోహలను నమ్ముతుంటారు.
ఆడవారి ఆత్మవిశ్వాసం ఆమె బట్టల నుంచే పెరుగుతుందంటారు నిపుణులు. ఆడవారి శరీరం పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరికి ఎన్నో రకాల దుస్తులు అవసరమవుతాయి. బట్టల విషయానికొస్తే ప్రతి మహిళ లోపల, వెలుపల సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే మహిళలు వారి లోదుస్తుల విషయంలో ఎన్నో అపోహలను నమ్ముతారు. అపోహలేంటి? నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అపోహ: పీరియడ్ ప్యాంట్లు నీట్ గా ఉండవు
వాస్తవం: పీరియడ్ ప్యాంటీలలో చాలా పొరలు ఉంటాయి. ఇవి మురికి, ధూళిని నివారించే విధంగా తయారుచేయబడ్డాయి. వీటి నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా దద్దుర్లు వచ్చే అవకాశం లేదు. కానీ వీటి విషయంలో ఆడవారు ఎన్నో అపోహలను నమ్ముతారు.
అపోహ: అమ్మాయిలు చాలా చిన్న వయసులో బ్రాలు వేసుకోకూడదు
వాస్తవం: చిన్న వయసులోనే బ్రా లను వేసుకోవడం వల్ల వక్షోజాలు సరిగా అభివృద్ధి చెందవు. లేదా వాటి ఆకారం దెబ్బతింటుందని చాలా మంది నమ్ముతారు. సమయానికి బ్రా ను ధరించడం వల్ల శరీర భాగాన్ని రిలాక్స్ చేయడంతో పాటుగా రొమ్ము వేడికి గురికాకుండా కూడా నిరోధించవచ్చు. ఇది అభివృద్ధికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
అపోహ: బ్రా వక్షోజాలను నొక్కుతుంది
వాస్తవం: పుష్-అప్ బ్రాలు మన ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపవు. కానీ బ్రాను ఎంచుకునేటప్పుడు దాని సైజ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి.
అపోహ: నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది
వాస్తవం: బ్రా ధరించి కొంతమంది హాయిగా నిద్రపోతారు. దీనిలో తప్పేం లేదు. రొమ్ము క్యాన్సర్ కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్ ఉంటే రొమ్ముల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. గడ్డలు అవుతాయి. కానీ బ్రాల వల్ల రొమ్ము క్యాన్సర్ రాదు.