వీటిని తింటే అలెర్జీ వస్తుంది జాగ్రత్త..
ఫుడ్ అలెర్జీ వల్ల చర్మం దద్దుర్లు లేదా దురద, ముఖం, పెదవులు లేదా నాలుకలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు కడుపు నొప్పి లేదా విరేచనాలు, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
ఫుడ్ అలెర్జీ అనేది మనలో చాలా మందిలో కనిపించే సాధారణ ఆరోగ్య సమస్య. శరీర రోగనిరోధక వ్యవస్థ ఆహారంలోని కొన్ని ప్రోటీన్లకు ప్రతిస్పందించినప్పుడు ఫుడ్ అలెర్జీ వస్తుంది. ఫుడ్ అలెర్జీ ప్రధాన లక్షణాలు: దద్దుర్లు లేదా దురద, ముఖం, పెదవులు లేదా నాలుకలో వాపు. అలాగే దీనివల్ల కడుపు నొప్పి లేదా విరేచనాలు, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అలెర్జీలకు కారణమయ్యే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
shrimps
రొయ్యల అలెర్జీ
రొయ్యల అలెర్జీ సీఫుడ్ అలెర్జీ కిందికి వస్తుంది. ట్రోపోమైయోసిన్, అర్జినిన్ కినేస్, పర్వాల్బుమిన్ వంటి ప్రోటీన్లు సీఫుడ్ అలెర్జీ అత్యంత సాధారణ ట్రిగ్గర్లు. ఇది దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలకు దారితీస్తుంది.
గుడ్డు అలెర్జీ
అలెర్జీలకు కారణమయ్యే మరొక ఆహారం గుడ్లు. గుడ్డులోని తెల్లసొనలో, పచ్చసొనలో వేర్వేరు ప్రోటీన్లు ఉండటం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
ఆవు పాలు
ఆవు పాల అలెర్జీ ఉన్నవారికి వీటిని తాగితే వాపు, దద్దుర్లు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. మీకు అలెర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయినట్టైతే ఆవు పాలు, దానితో తయారైన ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది. పాలలోని కేసైన్ అనే ప్రోటీన్ వల్ల ఈ అలెర్జీ వస్తుంది. పాలలోని చక్కెర అయిన లాక్టోస్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి అలర్జీలు ఉన్నవారు కేవలం పాలనే కాకుండా వెన్న, నెయ్యి, పెరుగు వంటి అన్ని రకాల పాల ఉత్పత్తులను కూడా మానేయాలి.
పల్లీలు
వేరుశెనగ కొంతమందికి అలెర్జీని కలిగిస్తుంది. వేరుశెనగలోని ప్రోటీన్ భాగాల వల్ల అలెర్జీలు వస్తాయి. శుద్ధి చేసిన వేరుశెనగ నూనె సాపేక్షంగా తక్కువ అలెర్జీ. వేరుశెనగ వెన్నను క్రమం తప్పకుండా తినే వ్యక్తులు కూడా ఉన్నారు. వేరుశెనగ అలెర్జీ ఉన్నవారు వేరుశెన వెన్నను తీసుకోకూడదు. దీనికి బదులుగా బాదం వెన్నను తినండి.