కొబ్బరి నీళ్లను తాగినా బరువు తగ్గుతారా?
ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది.

ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాలను తప్పక తాగాల్సిందే. ఇలాంటి పానీయాల్లో కొబ్బరి నీరు ఒకటి. నిజానికి కొబ్బరి నీరు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా బరువును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఈ కొబ్బరి నీరు టైఫాయిడ్, ఫ్లూ వంటి కొన్ని వ్యాధుల నుంచి తొందరగా కోలుకోవడానికి బాగా సహాయపడుతుంది. అసలు ఈ కొబ్బరి నీళ్లు బరువ తగ్గడానికి ఎలా సహాయపడుతుంతో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
కేలరీలు తక్కువగా ఉంటాయి
కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే చాలా సులువుగా, తొందరగా బరువు పెరుగుతారు. బరువు తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తీసుకోవాలి. అయితే కొబ్బరి నీరు తక్కువ కేలరీలు పానీయాలలో ఒకటి. అందుకే బరువు తగ్గేవారికి బాగా సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. అలాగే షుగర్ రష్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
Image: Getty Images
న్యూట్రీషియన్ రిచ్
కొబ్బరి నీళ్లలో పోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో సమతుల్యతను కాపాడటానికి సహాయపడే ఎంజైమ్లు, ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.
బయో ఎంజైమ్లు
బరువు తగ్గడానికి కొబ్బరి నీరు బాగా సహాయపడుతుంది. ఎలా అంటే ఇది జీర్ణక్రియను సులభతరం చేయడానికి సహాయపడే ఎంజైమ్లను కలిగి ఉంటుంది. అలాగే జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది.
ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది
పోషకాలు పుష్కలంగా ఉండే కారణంగా.. కొబ్బరి నీరు కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది అకస్మత్తుగా వచ్చే ఆహార కోరికలను కూడా తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
కొబ్బరి నీళ్లలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి అధిక జీవక్రియ సమయంలో కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
హైడ్రేషన్ కు మంచిది
కొబ్బరి నీరు శరీర ఆర్ద్రీకరణను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకుంటేనే మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కొబ్బరి నీరు శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.