కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్.. రెండింటిలో ఏది బెస్ట్?
ఆలివ్ ఆయిల్ మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అందుకే దీన్ని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

olive oil
మన జీవన శైలి సరిగ్గా లేకుంటే మన మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలం గడుస్తున్న కొద్దీ చాలా మంది నిశ్చల జీవనశైలికి గుడ్ బై చెప్పి ఫిట్ నెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యం, పోషణ విషయానికి వస్తే తినే ఆహారంపైనే ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆహారం విషయానికొస్తే వంట చేయడానికి ఉపయోగించే నూనె విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ లో ఎన్నో రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నప్పటికీ.. మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను కలిగించే సరైన వంటనూనెను మాత్రమే ఉపయోగించాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ అన్నింటికంటే ఆరోగ్యకరమైన నూనెలుగా పరిగణించబడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో కొబ్బరి నూనెను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే ఇది ఎంత ఆరోగ్యకరమైనది అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.
ఆలివ్ ఆయిల్ వర్సెస్ కొబ్బరి నూనె: ఏది మంచిది?
కొబ్బరి నూనెలో ఎక్కువగా మీడియం-చైన్-ట్రైగ్లిజరైడ్స్ (ఎంసిటి) అని పిలువబడే అణువుల రూపంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది మీ శరీరం బర్న్ చేసే కేలరీల సంఖ్యను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఇది బరువు తగ్గాలనుకునే వారికి బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెను 350 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు వేడి చేయొచ్చు. ఇది మితమైన అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి బాగా సహాయపడుతుంది.
Image: Getty Images
లారిక్ ఆమ్లం కొబ్బరి నూనెలో కనిపించే కొవ్వు ఆమ్లం. ఇది ఎంసీటీలలో దాదాపు సగం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధి కారక క్రిములతో పోరాడుతాయి. అందుకే లారిక్ ఆమ్లం బ్యాక్టీరియాను సమర్థవంతంగా నాశనం చేసే సమర్థవంతమైన బాక్టీరిసైడల్ ఏజెంట్ పనిచేస్తుంది.
olive oil
ఆలివ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన వంట నూనెలలో ఒకటిగా నిరూపించబడింది కూడా. ఆలివ్ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులు. అలాగే మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముక సాంద్రతను పెంచడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు దీనిలో ఉండే విటమిన్ ఇ విటమిన్ కెతో కలిసి కణజాల మరమ్మత్తుకు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ స్మోకింగ్ పాయింట్ 280 డిగ్రీల ఫారెన్ హీట్. దీనిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయకూడదు. కాగా ఆలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. అందుకే ఇది ఆరోగ్యకరమైన వంటనూనెగా పరిగణించబడుతుంది.