Health Tips: చియా సీడ్స్ వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. ఆశ్చర్య పోవాల్సిందే!
Health Tips: ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా నిండి ఉన్న చియా సీడ్స్ గురించి చాలామందికి పెద్దగా అవగాహన లేదు. అయితే ఈ చియా సీడ్స్ ని ఆహారంగా తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు, అవేమిటో ఇప్పుడు చూద్దాం.
చియ గింజలలో ఫైబర్ ఆల్ఫా లినోలెని యాసిడ్ అధిక కంటెంట్ మీ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ విత్తనాలు టైప్ టు డయాబెటిస్ కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చియా విత్తనాలు ఇన్సూలిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. చియా గింజలతో కూడిన బ్రెడ్ తినటం భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని నిర్ధారించబడింది.
ప్రోటీన్ సమృద్ధిగా ఉండే చియా గింజలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలాగా చేస్తాయి. దీని వలన తినాలి అనే కోరిక ఉండదు. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 28 గ్రాముల చియా విత్తనాలలో 10 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. రోజువారి వినియోగం వల్ల ఒంట్లో కొవ్వు తగ్గిస్తుంది.
చియా గింజలలో గుండెకి ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని గుండె జబ్బుల ప్రమాదాన్ని నుంచి నివారిస్తాయి.. కాల్షియం, మెగ్నీషియం బాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలు ఈ చియా విత్తనాలలో ఉంటాయి. కాబట్టి చియా విత్తనాలని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు.
అలాగే బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత చికిత్సకు కూడా ఇవి సహాయపడతాయి. చియా గింజలలో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి దీని వలన చర్మకాంతి మెరుగుపడుతుంది.
పర్యావరణ పర్యావరణ నష్టం నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను కూడా నివారిస్తుంది. చియా విత్తనాలని నానబెట్టి ఉదయం పూట ఖాళీ కడుపుతో తినటం వలన జీర్ణశక్తి పెరుగుతుంది పేగు కదలికలని మెరుగుపరుస్తుంది.