Betel Leaf: షుగర్ కంట్రోల్లో ఉండాలంటే రోజూ ఈ ఒక్క ఆకు నమిలితే చాలు!
తెలుగు సంస్కృతిలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పూజలు, శుభకార్యాల్లో అయితే ఈ ఆకు తప్పనిసరి. అంతేకాదు తమలపాకు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. రోజూ తమలపాకు తినడం వల్ల జబ్బులు దూరం అవుతాయట. అవెంటో ఇక్కడ చూద్దాం.

పూజలు, వ్రతాలు, శుభకార్యాలలో తమలపాకుది ప్రత్యేక స్థానం. ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ఇది ముందు వరుసలో ఉంటుంది. భోజనం తర్వాత తమలపాకు తినడం పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇప్పటికీ కొన్ని పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వింధు బోజనం తర్వాత తమలపాకు ఇస్తుంటారు.
అయితే రోజూ తమలపాకు తినడం వల్ల చాలా లాభాలున్నాయి అంటున్నారు నిపుణులు. ఈ ఒక్క ఆకుతో చాలా జబ్బులను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. తమలపాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం తర్వాత..
భోజనం తర్వాత ఒక్క తమలపాకు తింటే శరీరానికి ఎంత మంచిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తమలపాకు తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. తమలపాకు రసం ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అందుకే పెళ్లిళ్లలో, ఇతర కార్యక్రమాల్లో భోజనం తర్వాత తమలపాకు ఇస్తుంటారు.
నోటి ఆరోగ్యానికి
తమలపాకు నమిలితే నోటి దుర్వాసన పోతుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఉన్నాయి. ఇంకా, మసాలా తమలపాకు తిన్న తర్వాత నోరు తాత్కాలికంగా సువాసనగా కూడా ఉంటుంది.
శ్వాస వ్యవస్థకు
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తమలపాకు శ్వాస సంబంధ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుందట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా, జలుబు ఉంటే తమలపాకు తినాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
షుగర్ లెవెల్స్
తమలపాకు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు కొన్ని చెంచాల తమలపాకు రసం తాగితే చాలా మంచిది. షుగర్ లెవెల్స్ నాచురల్ తగ్గించుకోవడానికి ఇది మంచి మార్గం.
ఒత్తిడిని తగ్గిస్తుంది
తమలపాకు నమిలితే కొంతవరకు ఆందోళన తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫెలోనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది.