పురుషుల్లో సంతానలేమి.. కారణాలివే..!
వంధ్యత్వం సమస్యలు మహిళల్లోనే కాదు పురుషుల్లో కూడా పెరుగుతున్నాయని పలు నివేదికలు వెల్లిడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలేనంటున్నారు డాక్టర్లు.

వంధ్యత్వం పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేసే సమస్య. ఈ సంతానలేమి చాలా కుటుంబాల్లో పెద్ద సమస్యగా మారింది. వంధ్యత్వానికి సమర్థవంతమైన చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ ఈ చికిత్సను పొందడానికి చాలా మందికి ఆర్థిక స్టోమత, సామాజిక పరిస్థితులు ఉండకపోవచ్చు. వంధ్యత్వానికి పేలవమైన జీవనశైలే ప్రధాన కారణమంటున్నారు డాక్టర్లు. అయితే పురుషుల్లో సంతానలేమికి దారితీసే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Infertility
డైట్
చెడు ఆహారాలు అంటే మీ శరీనికి అవసరమైన పోషకానలు అందించని ఆహారం, శరీరానికి ఎన్నో విధాలుగా హాని కలిగించే కారకాలున్న ఆహారాలను క్రమం తప్పకుండా తినే అలవాటున్న పురుషులకు ఎన్నో రోగాలు వస్తాయి. ముఖ్యంగా వీటివల్ల సంతానలేమి సమస్య కూడా వస్తుంది. వీర్యకణాల సంఖ్య మెరుగ్గా ఉండాలంటే పోషకాలు అవసరం. ఇవి అందుబాటులో లేకపోతే సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఊబకాయం కూడా చాలా మందిలో సంతానలేమికి కారణమవుతుంది. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. పోషకాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. బయటి ఆహారాన్ని తగ్గించండి. ఈ అలవాట్లు సంతానలేమి సమస్యను పోగొడుతాయి.
మత్తు
ధూమపానం, మద్యపానం, ఇతర పదార్ధాల వాడకం వంటివన్నీ పురుషుల్లో వంధ్యత్వ ప్రమాదాన్ని క్రమంగా పెంచుతాయి. అలాగే ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తాయి.
శారీరక శ్రమ
వ్యాయామం చేయకపోవడం, ఇతర శారీరక శ్రమలో పాల్గొనకపోవడం వంటివన్నీమీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఇది పురుషులలో వంధ్యత్వ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు, ఎత్తుకు తగ్గ బరువు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
men infertility
వేడి
ఎక్కువ వేడి పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. పురుషులు మరీ వేడినీటితో స్నానం చేయకూడదు. అలాగే కొన్ని పనులు చేసేవారు కూడా వేడి వాతావరణంలో అదనపు సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారిలో సంతానలేమి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వేడికి తోడు క్రమం తప్పకుండా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాదు. ఇది స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతుంది.
<p>infertility</p>
హార్మోన్ల సమస్యలు
పురుషులలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన హార్మోన్లు సమతుల్యంగా ఉండాలి. ఇవి అసమతుల్యంగా మారితే కూడా వంధ్యత్వం సమస్య వస్తుంది.
రోగాలు
పునరుత్పత్తి వ్యవస్థతో సంబంధం ఉన్న అవయవాలను ప్రభావితం చేసే వ్యాధులు, లైంగిక సంక్రమణ వ్యాధులు కూడా వంధ్యత్వానికి దారితీస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మానసిక ఆరోగ్య సమస్యలు
ఒత్తిడి, యాంగ్జైటీ, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఇవి కూడా వంధ్యత్వానికి దారితీస్తాయి.