నిద్రపోయినప్పుడు నోట్లోంచి లాలాజలం ఎందుకు కారుతుంది? కారణాలు, పరిష్కార చిట్కాలు మీకోసం
చిన్న పిల్లలే కాదు.. చాలా మంది పెద్దలు కూడా ఎదుర్కొనే సాధారణ సమస్య పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారడం. అసలు పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం ఎందుకు కారుతుంది? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఎప్పుడూ ఏదో అనారోగ్య సమస్యతో బాదపడుతుంటారు. మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అయితే నమలో చాలా మంది ఎదుర్కొనే సమస్య పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారడం. నిజానికి చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పెద్దలు, యువతలో కూడా ఈ సమస్య ఉంటుంది. ఇది నవ్వుతెప్పించే విషయమే అయినా.. ఇది ఆరోగ్య సమస్యలలో ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఇది నలుగురిలో ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే ఈ సమస్యను తగ్గించడానికి ప్రయత్నించాలి.
సాధారణంగా చిన్న పిల్లల్లోనే నిద్రపోతున్నప్పుడు నోట్లోంచి లాలాజలం వస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న పిల్లలకు దంతాలు లేకపోవడం, లేదా వస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది. కాబట్టి ఇది వారికి సర్వసాధారణం. కానీ పెద్దలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాం. అలాగే పడుకున్న కొద్దిసేపటి తర్వాత కొంతమంది నోట్లోంచి లాలాజలం బయటకు వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇది ఎక్కువగా వస్తే.. మరికొంతమందికి మాత్రం తక్కువగా వస్తుంది. మీ నోట్లోంచి లాలాజలం కారుతుంటే.. హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోండి. దీనికి చికిత్స తీసుకోండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిజానికి ఈ సమస్య మనకున్న చెడు అలవాట్ల వల్ల కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. లేదా మీకున్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతుందని నిపుణులు అంటున్నారు.
కారణాలు ఏమిటి?
మీకు ఏదైనా అలెర్జీ ఉన్నా కూడా మీరు పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతుంది.
దగ్గు, జలుబు, గొంతు సమస్య, శ్వాసకోశ వ్యాధి వంటి ఇతర సమస్యల వల్ల కూడా నోట్లోంచి లాలాజలం కారుతుంది.
ఏవైనా జీర్ణసమస్యలు, ఉదర సమస్యలు, అజీర్ణం వంటి సమస్యల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
నిద్రలేమి కూడా లాలాజల సమస్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రెగ్యులర్ గా బయట తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
మానసిక సమస్యలు కూడా ఇందుకు దారితీస్తాయి.
అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే.. ఆమ్ల ఆహారాన్ని ఎక్కువగా తింటే కూడా ఈ సమస్య వస్తుంది.
ఎలా తగ్గించుకోవాలి?
మీరు పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతున్నట్టైతే గోరువెచ్చని నీటితో నోటిని కడగండి. అలాగే ప్రతి రోజూ తులసి ఆకులను తినండి. లేదా వేడి నీటిలో ఉసిరి పొడి వేసి తిన్న తర్వాత ఆ నీటిని తాగాలి.