క్యాన్సర్ గురించి ఇలాంటి విషయాలను అస్సలు నమ్మకండి..
cancer awareness day 2023: క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసే ప్రాణాంతక వ్యాధి. దీనికి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దీనిమూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈ వ్యాధి ఎన్నో రకాలుగా ఉంటుంది. అయితే ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది దీనికి బలైపోతున్నారు.
cancer
cancer awareness day 2023: క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మరణానికి కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోగం బారిన ఎంతో మంది పడుతున్నారు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 100 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో కూడా దీని గురించి జనాలకు ఎన్నో విషయాలు తెలియవు. అలాగే దీని గురించి ఎన్నో అపోహలను నమ్ముతున్నారు. ఇవి జనాల్లో క్యాన్సర్ గురించి ఎంతో భయాన్ని పుట్టిస్తాయి. క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
అందుకే ఈ డేంజర్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది నవంబర్ 7 న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్యాన్సర్ కు సంబంధించిన అపోహలేంటి? నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అపోహ 1: క్యాన్సర్ ఒక అంటువ్యాధి
వాస్తవం: చాలా మంది క్యాన్సర్ ను కూడా ఒక అంటువ్యాధిగానే భావిస్తారు. ఇది కూడా దగ్గు, జలుబు, ఫ్లూ లేదా ఇతర అంటు వ్యాధుల లాగే శారీరక సంబంధం వల్ల ఒక వ్యక్తి నుంచి మరొకవ్యక్తికి వ్యాపిస్తుందని నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే క్యాన్సర్ అంటువ్యాధి అసలే కాదు. క్యాన్సర్ ఒక వ్యక్తి శరీరంలో అసాధారణ కణాల పెరుగుదల వల్ల వస్తుంది. అలాగే క్యాన్సర్ బాధితుడితో సంబంధం పెట్టుకుంటే కూడా ఇది వేరేవాళ్లకు రాదు.
అపోహ 2: అన్ని గడ్డలు క్యాన్సరే
వాస్తవం: శరీరంలోని అన్ని రకాల గడ్డలు కూడా క్యాన్సర్ వల్లే అవుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే రొమ్ము క్యాన్సర్ ఉన్న వారి రొమ్ముల్లో గడ్డలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది రొమ్ము క్యాన్సర్ సాధారణ లక్షణంగా భావిస్తారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. రొమ్ములో గడ్డలు ఉన్నంత మాత్రానా అది ఖచ్చితంగా క్యాన్సర్ కాకపోవచ్చు. ఈ గడ్డలలో 10% నుంచి 20% క్యాన్సర్, మిగిలినవన్నీ ఇతర కారణాల వల్ల వచ్చినవని నిపుణులు అంటున్నారు.
cancer
అపోహ 3: క్యాన్సర్ ఉంటే ఖచ్చితంగా చనిపోతారు
వాస్తవం: దీన్ని కూడా చాలా మంది నమ్ముతారు. క్యాన్సర్ ఉంటే ఖచ్చితంగా చనిపోతారనే దానిలో ఏ మాత్రం నిజం లేదు. ఈ రోగాన్ని సకాలంలో గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా ఆ వ్యక్తిని కాపాడొచ్చు. అలాగే చర్మం లేదా థైరాయిడ్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్లు ప్రారంభ దశలో గుర్తించినప్పుడు ఎక్కువ రోజులు బతకొచ్చు.
అపోహ 4: క్యాన్సర్ రోగులు ఎప్పుడూ హాస్పటల్ లోనే ఉండాలి
వాస్తవం- క్యాన్సర్ కు చికిత్స తీసుకునేటప్పుడు పేషెంట్ ఎక్కువ సమయం హాస్పటల్ లోనే గడపాల్సి వస్తుంది. కానీ జీవితమంతా హాస్పటల్ లోనే ఉంటాడని దీనర్థం కాదు. వ్యాధితో పోరాడటానికి పేషెంట్ కుటుంబం, స్నేహితుల మధ్య ఉండటం మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. అంటే పూర్తిగా హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని కాదు.
అపోహ 5: పెద్దవారికి క్యాన్సర్ నయం కాదు
వాస్తవం: దీన్ని కూడా చాలా మంది గుడ్డిగా నమ్ముతారు. వృద్ధులకు క్యాన్సర్ ఉంటే జీవించే అవకాశం తక్కువని చెప్తుంటారు. కానీ ఇది మీ ఊహే. కానీ ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత క్యాన్సర్ లక్షణాలు పెరుగుతాయి. ఏదేమైనా వృద్ధులు సమర్థవంతమైన చికిత్స తీసుకుంటే ఇది కూడా నయమవుతుంది.