MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • best time to eat fruits: పండ్లు ఏ టైంలో తింటే మంచిది? పరగడుపున తింటే ఏమైనా ప్రమాదమా ?

best time to eat fruits: పండ్లు ఏ టైంలో తింటే మంచిది? పరగడుపున తింటే ఏమైనా ప్రమాదమా ?

పండ్లు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ ఏ పండ్లు ఎప్పుడు తింటే మంచిది? ఎలా తింటే మంచిది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఏమైనా ఇబ్బందా? నిపుణులు ఏమంటున్నారో మీకోసం..

2 Min read
Author : Kavitha G
Published : Feb 01 2025, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎప్పుడు పడితే అప్పుడూ.. ఎంత పడితే అంత తింటే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏ పండ్లను ఏ టైంలో తింటే మంచిది? పరగడుపున పండ్లు తింటే ఏమవుతుంది? అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది? తదితర విషయాలు మీకోసం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉదయాన్నే పండ్లు తినవచ్చా?

ఉదయాన్నే పండ్లు తినవచ్చా?

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అందరు ఇష్టంగా తింటారు. కొందరైతే ఉదయాన్నే పండ్లు తింటారు. కానీ ఖాళీ కడుపుతో పండ్లు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరగడం, జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ మందగించి, వాపు, గ్యాస్, మలబద్ధకం, వాంతులు వస్తాయని చెబుతున్నారు.

గర్భిణులు, జీర్ణ సమస్యలున్నవారు డాక్టర్ సలహా తీసుకుని పండ్లు తినాలి. డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే పండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

ఉదయాన్నే ఏ పండ్లు తినడం మంచిది?

సాధారణంగా ఉదయాన్నే పండ్లు తినకపోవడమే మంచిది. ఒకవేళ మీరు నీళ్లు తక్కువగా తాగే వారైతే, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, పీచు, పైనాపిల్, నారింజ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినవచ్చు.

35
ఏయే పండ్లు తినాలి?

ఏయే పండ్లు తినాలి?

రంగు రంగుల పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. ప్రతి రంగులోనూ వేర్వేరు యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. కాబట్టి ఆపిల్, బనానా, కివీ, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ తదితర పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. రోజూ పండ్లు తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. శక్తి పెరుగుతుంది, డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

45
పండ్లు తినడానికి బెస్ట్ టైం?

పండ్లు తినడానికి బెస్ట్ టైం?

చాలామంది ఉదయాన్నే పండ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ పోషకాలు బాగా శోషించుకోవాలంటే భోజనానికి మధ్యలో, అంటే టిఫిన్, లంచ్ మధ్య, లంచ్, డిన్నర్ మధ్య పండ్లు తినాలి.

భోజనంతో పాటు, ఉదయాన్నే మొదటి ఆహారంగా, రాత్రి చివరి ఆహారంగా పండ్లు తినకూడదు.

55
నిపుణుల సూచన

నిపుణుల సూచన

ప్రతి ఒక్కరి శరీరం వేరుగా ఉంటుంది. కాబట్టి శరీరానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే పండ్లు తింటే మీకు సరిపోతుంటే తినాలి. ఏదైనా సమస్య వస్తే మానేయాలి. డాక్టర్ సలహా పాటించాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved