MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • చలికాలంలో పెరుగును తినొచ్చా?

చలికాలంలో పెరుగును తినొచ్చా?

చలికాలం మొదలైంది. చల్లని గాలులు మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. అందుకే ఈ సీజన్ లో మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం. సీజన్ మారినప్పుడల్లా మనం తినే ఆహారం కూడా మార్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : R Shivallela
Published : Oct 29 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చలికాలం వచ్చేసింది. ఈ సీజన్ లో మనం తినే ఆహారం, చర్మం, జుట్టు మొదలైన వాటిపై తగిన ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే మన చర్మం, వెంట్రుకలు నిర్జీవంగా మారుతాయి. అలాగే చలినుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ సీజన్ లో వేడివేడి పదార్థాలు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీజన్ మారినప్పుడల్లా మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సీజన్ లో పెరుగును తినకూడదని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే పెరుగుకు చలువ చేసే గుణం ఉంటుంది. ఈ సీజన్ లో పెరుగు తిన్నా, మజ్జిగను తాగినా  జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తాయని నమ్ముతారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పెరుగులో పోషకాలు

పెరుగులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పెరుగు చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

36

ఆయుర్వేదం ప్రకారం

ఆయుర్వేదం ప్రకారం.. చలికాలంలో పెరుగును తినకూడదు. ఎందుకంటే ఇది శ్లేష్మం, ఇతర గ్రంథుల స్రావాన్ని పెంచుతుంది. అంతేకాదు సైనసైటిస్, ఆస్తమా, జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలను కూడా పెంచుతుంది. అందుకే ఈ సమస్యలున్నవారు దీనికి దూరంగా ఉండాలి. పెరుగును రాత్రిపూట అస్సలు తినకూడదు. 
 

46

సైన్స్ ప్రకారం

పెరుగులో మన గట్ కు అవసరమైన మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది పులియబెట్టబడుతుంది. కాబట్టి పెరుగుతో పాటు పులియబెట్టిన ఆహారాలను తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో విటమిన్ బి12, క్యాల్షియం,  ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. పెరుగును తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే శ్వాస సమస్యలతో బాదపడేవారు సాయంత్రం 5 గంటల తర్వాత పెరుగును తినకూడదు. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి.

56

పెరుగులో విటమిన్ సి ఉంటుంది. ఇది జలుబును తగ్గించడానికి సహాయపడుతుందని చాలా మంది అంటున్నారు. అయితే ఇందుకోసం పెరుగును గదిఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. మరీ చల్లని పెరుగును తింటే జలుబు ఎక్కువ అవుతుంది. 

66

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. చలికాలమని దీన్ని మొత్తమే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అయితే చలికాలంలో పెరుగును తక్కువగా తినడం మంచిది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడేవారు రిఫ్రిజిరేటర్ లో పెట్టిన పెరుగు కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పెరుగును తినాలి. 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved