MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఇదొక్కటి చేస్తే మీ వెన్ను నొప్పి మటుమాయం..

ఇదొక్కటి చేస్తే మీ వెన్ను నొప్పి మటుమాయం..

నడుము నొప్పి మాటల్లో చెప్పలేని బాధను కలిగిస్తుంది. ప్రస్తుత చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య రోజు రోజుకు ఎక్కువ అవ్వడమే కానీ.. తగ్గడమంటూ ఉండదు. కానీ మీరు ఒక పనిచేస్తే మాత్రం నడుము నొప్పి తొందరగా తగ్గిపోతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 26 2024, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధమే లేకుండా పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఈ వెన్ను నొప్పి వల్ల నడవడం,  కూర్చోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అసలు ఏం చేస్తే ఈ నొప్పి తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వెన్నునొప్పికి కారణాలు

వీపు ఎముకలు, కండరాలు, స్నాయువుల సమస్యల వల్ల కూడా వెన్ను నొప్పి సమస్య వస్తుంది. అలాగే కడుపును ఏదైనా సమస్య ఉంటే కూడా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటుగా టూ వీలర్ పై దూర ప్రయాణాలు చేయడం, పోషకాహార లోపం, స్థూలకాయం కూడా వెన్నునొప్పికి దారితీస్తాయి. ముఖ్యంగా కంప్యూటర్ ముందు గంటలకు గంటలు కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వెన్నుపామును బలోపేతం చేయడానికి యోగా, వ్యాయామాలు కూడా చేయాలని వైద్యులు చెబుతున్నారు.
 

35

ఎంతో మందికి వెన్ను నొప్పి సమస్య ఉంటుంది. అయితే దీనిని తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు? అనే దానిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. లాన్సెట్ నిర్వహించిన అధ్యయనంలో 54 ఏండ్ల వయసున్న 701 మంది ఆస్ట్రేలియన్లపై ఈ అధ్యయనం చేశారు. వారిలో కొందరు ఎలాంటి వ్యాయామం చేయకుండా సాధారణ జీవితాన్ని గడపగా, మరికొందరు వెన్ను కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని వ్యాయామాలు చేశారు. కొంతమంది రోజుకు 30 నిమిషాలు మాత్రమే నడుస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. వేరే  రెండు సమూహాలతో పోలిస్తే 30 నిమిషాలు నడవడం వెన్నునొప్పిని తగ్గిస్తుందని నివేదించబడింది.
 

45

అయినప్పటికీ వెన్నునొప్పి తగ్గాలంటే మాత్రం సమతులాహారం తీసుకోవాలి. అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే వెన్ను నొప్పి చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వెన్ను నొప్పి ఎప్పుడు వస్తుంది? దీని లక్షణాలు ఉంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

55

వెన్నునొప్పి లక్షణాలు

కొద్దిదూరం నడిచినా కూడా బాగా అలసిపోతారు. అలాగే  వీపు కింది భాగంలో కత్తి పోట్లకు గురవుతారు. తేలికపాటి నొప్పి, కండరాల తిమ్మిరి, వంగి ఏదైనా తీసుకున్నప్పుడు విపరీతమైన నొప్పి కలగడం వెన్నునొప్పి లక్షణాలు. మీరు గనుక ఈ లక్షణాలను మీలో గమనిస్తే వెంటనే చికిత్స  తీసుకోండి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image2
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved