Health Tips: బొప్పాయి ఆకుల రసం.. పడిపోయిన ప్లేట్లెట్లకు దివ్య ఔషధం!
Health Tips: ఆరోగ్యానికి బొప్పాయి పండు మాత్రమే కాదు, బొప్పాయి ఆకుల రసం కూడా దివ్య ఔషధం. ప్లేట్లెట్ల పెరుగుదల కోసమే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది బొప్పాయి ఆకుల రసం. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యానికి బొప్పాయి పండు ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. అంతేకాకుండా బొప్పాయి ఆకుల రసం కూడా ఆరోగ్యానికి అంతే ఉపయోగపడుతుంది. అయితే ప్లేట్లెట్ల పెరుగుదల లో మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా బొప్పాయి ఆకుల రసం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి ఆకులలో కనిపించే పపైన్ చాలా మంచి ఔషధం. ఈ ఔషధం ప్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే టాక్సిన్స్ ని తొలగించి చర్మానికి మేలు చేస్తుంది. అలాగే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లేట్ల స్థాయి..
పడిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం, అటువంటప్పుడు బొప్పాయి ఆకుల రసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని ప్లేట్లెట్లను పెంచడానికి పనిచేస్తుంది. ఈ ఆకుల రసంలో విటమిన్ ఏ,విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి.
ఇవి రక్తంలో పడిపోయిన ప్లేట్లెట్ల స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే బొప్పాయి ఆకుల రసం జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఎంజైమ్ లు వాపును తగ్గిస్తాయి.
ఈ ఆకుల్లో నీరు, పీచు ఎక్కువగా ఉంటుంది అందుకే మలబద్ధకాన్ని దూరం చేయటంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆకులో ఉండే ఫోలిక్ ఆసిడ్ శరీరంలోని చెడు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచూ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మేలు చేస్తుంది కదా అని బొప్పాయి ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే వాంతులు, విరోచనాలు, తల తిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.