MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • ఏడాది వయసున్న పిల్లలు చాక్లెట్లు, గుడ్లు తినొచ్చా?

ఏడాది వయసున్న పిల్లలు చాక్లెట్లు, గుడ్లు తినొచ్చా?

ఏడాది వయసున్న పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏవి పడితే అవి తినిపిస్తే పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 20 2022, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మొదటిసారిగా తల్లిదండ్రులైన వారికి పిల్లల పెంపకం చాలా కష్టంగానే ఉంటుంది. పిల్లలను ఎలా చూసుకోవాలి? ఎలాంటి ఫుడ్ పెట్టాలన్న వాటిపై క్లారిటీ ఉండదు. ఎదుగుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్నే పెట్టాల్సి ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
baby food

baby food

పిల్లలకు పాలు కాకుండా ఇతర ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి.. ముఖ్యమైన పోషకాలను అందిస్తూ ఉండాలి. పోషకాలే వారి శారీరక, మానసిక ఎదుగుదలకు సహాయపడతాయి. అయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అంటూ పెద్దలు తినే వాటిని కూడా తినిపిస్తుంటారు. కానీ పిల్లలకు హాని చేసే ఆహారాలు చాలానే ఉన్నాయి. అందుకే సంవత్సరం వయసున్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటివి పెట్టకూడదు అన్న విషయాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. 

37

శిశువులకు ఘనమైన ఆహారాన్ని ఎప్పుడు ఇవాలి? 

మొదటి కొన్ని నెలలు గడిచిన వెంటనే చిన్న పిల్లలకు ఘనమైన ఆహారాలను తినిపించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వారి జీర్ణక్రియకు వీటిని అరిగించుకునే సామర్థ్యం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే పెట్టండి. ఈ వయసు పిల్లలకు తల్లిపాలే పోషకాహారం. సాధారణంగా పుట్టి ఆరు నెలలు గడిచిన తర్వాత పిల్లలకు ఘనమైన ఆహారాన్ని ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వారి శారీరక ఎదుగుదల, అభివృద్ధిని గుర్తుంచుకునే ఇవ్వాల్సి ఉంటుంది. 
 

47

పిల్లలకు బంగాళాదుంపలను, పండ్లను తినిపించొచ్చా? 

సరిగ్గా వండిన లేదా మెత్తగా ఉడికించిన బంగాళాదుంపలను, కూరగాయలను, జున్ను, అరటిపండ్లను, బఠానీలను తినిపించొచ్చు. అయితే సరిగ్గా పండని లేదా ఉడికించని వాటిని అసలే ఇవ్వకూడదు. ముఖ్యంగా ముడివి. వండని ముడి క్యారెట్లు వంటి కూరగాయలను చిన్న పిల్లలకు తినిపించకూడదు. ఎందుకంటే ముడి కూరగాయల్లో నైట్రేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వీటికి బదులుగా వారు సులువుగా తినేంత చిన్న సైజులో పండ్లను కట్ చేసి ఇవ్వండి. 
 

57

పిల్లలకు డ్రై ఫ్రైట్స్ తినపించొచ్చా? 

సంవత్సరం వయసున్న పిల్లలకు డ్రై ఫ్రూట్స్  ను అసలే తినపించకూడదు. గింజలు, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వేరు శెనగలు లేదా మరే డ్రై ఫ్రూట్స్ అయినా సరే పిల్లలకు వీటిని తినిపించకూడదు. ఎందుకంటే వారి అన్న వాహిక చిన్నగా ఉంటుంది. ఇవి అక్కడ ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. 
 

67

ఒక సంవత్సరం పిల్లలకు చాక్లెట్స్ తినిపించడం మంచిదేనా? 

చాక్లెట్లలో కెఫిన్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను చాక్లెట్లకు దూరంగా ఉంచాలి. ఈ చాక్లెట్లను పిల్లలు తింటే కొన్ని కొన్ని సార్లు అలెర్జీ కూడా రావొచ్చు. 
 

77

శిశువులకు గుడ్లు పెట్టొచ్చా? 

గుడ్లు మంచి పోషకాహారమే. కానీ పిల్లలకు తినిపించే ముందు ఒక సారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే గుడ్లు అలెర్జీకి కూడా దారితీయొచ్చు. ప్రతి పిల్లవాడి పోషణ అవసరం భిన్నంగా ఉంటుంది. అందుకే వారి ఫీడింగ్ విషయంలో ఆరోగ్య నిపుణుల సలహాలను తీసుకోవడం ఉత్తమం. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved