ఈ ఒక్క నూనెతో తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం!
సాధారణంగా మహిళలు పొడవైన, అందమైన జుట్టుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొత్త, కొత్త ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటారు. వాటివల్ల కొందరికి జుట్టు పెరిగితే.. మరికొందరికి ఉన్నది ఊడిపోతుంది. వాటిలో ఉండే కెమికల్స్ ఇందుకు కారణం కావచ్చు. మరి సహజంగా జుట్టును ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే...

ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జుట్టు సమస్యలు పెరిగిపోయాయి. జుట్టు రాలడం, చిట్లడం, పొడిబారడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి. వీటిని పరిష్కరించుకోవడానికి చాలా మంది రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. వాటిలోని రసాయనాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. సహజంగా తయారుచేసే హేయిర్ ఆయిల్ వాడితే మంచిదంటున్నారు.
నల్ల జీలకర్రతో..
సాధారణంగా మన కిచెన్ లో ఔషధగుణాలు కలిగిన ఎన్నో దినుసులు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఒకటి నల్ల జీరకర్ర. దీంతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నల్ల జీలకర్ర నూనె వాడితే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
తయారీ విధానం
నల్ల జీలకర్ర నూనె తయారీకి కావలసిన పదార్థాలు:
కొబ్బరి నూనె - 100 ml
నల్ల జీలకర్ర - 1 స్పూన్
మెంతులు - 1 స్పూన్
తయారీ విధానం:
నల్ల జీలకర్ర, మెంతులు మిక్సీలో పొడి చేయాలి. కొబ్బరి నూనెను బాణలిలో వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొడి వేసి కలపాలి. నూనె రంగు మారే వరకూ కలపాలి. ఆరిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెను తరచూ వాడితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
ఎన్ని ఉపయోగాలో..
- జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
- జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
- జుట్టు రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది.
- జుట్టు చిట్లడాన్ని, దురదను తగ్గిస్తుంది.