మీకు గోర్లు కొరికే అలవాటుందా? ఈ రోగాలొస్తయ్ జాగ్రత్త..
కొంతమంది ఎప్పుడు చూసినా గోర్లను కొరుకుతూనే ఉంటారు. ఇంకొంత మంది ఒత్తిడి, యాగ్జైటీగా ఫీలయ్యినప్పుడు ఇలా గోర్లను కొరుకుతుంటారు. కారణమేదైనా ఇలా గోర్లను కొరకడం వల్ల గోర్లు దెబ్బతినడంతో పాటుగా ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి.

గోర్లను కొరికే అలవాటు చాలా మందికే ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇదొక సాధారణ అలవాటు. ముఖ్యంగా ఆలోచన చేస్తున్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, యాంగ్జైటీగా ఉన్నప్పుడు లేదా విసుగు చెందినప్పుడు వారికి తెలియకుండానే గోర్లను తెగ కొరికేస్తుంటారు. దీనికి కారణమేదైనా ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మీ దంతాలకు హాని కలిగించడంతో పాటుుగా మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఎందుకు చేస్తారు?
అసలు జనాలు గోర్లను ఎందుకు కొరుకుతారు అనేది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఒక సిద్ధాంతం ప్రకారం.. గోర్లను కొరకడం వారి భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ ఇది ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజం కానేకాదు. అలాగే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
గోర్లను కొరకడం, దంతాల ఆరోగ్యం
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం.. గోర్లను కొరకడం వల్ల మీ దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇది దంతాలను చీల్చడం లేదా పగలగొట్టే అవకాశం ఉంది. గోర్లను కొరకడం వల్ల దంతాల నష్టం జరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం.. గోర్లను కొరికే అలవాటు తలనొప్పి, ముఖం నొప్పి, చిగుళ్లు, దంతాల సున్నితత్వం , దంతాల నష్టం వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఇతర ప్రమాదాలు
గోర్లను కొరకడం వల్ల దంతాల నష్టంతో పాటుగా బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం పెరుగుతుంది. మీ గోర్లు శుభ్రంగా కనిపించినప్పటికీ.. వీటిలో ఇ.కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. మీరు మీ గోర్లను కొరికినప్పుడు ఈ బ్యాక్టీరియా మీ వేళ్ల నుంచి నోటికి, గట్ కు వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జీర్ణశయాంతర అంటువ్యాధులకు దారితీస్తుంది. అయితే గోర్లు కొరికే అలవాటున్న వారికి పరోనిచియాను వచ్చే అవకాశం ఉంది. ఇది ఎరుపు, వాపు, చీముకు కారణమయ్యే చేతివేళ్ల ఇన్ఫెక్షన్.
గోర్లను ఎవరు ఎక్కువగా కొరుకుతారు?
గోర్లను కొరికే అలవాటు ఎక్కువగా పిల్లలు, టీనేజర్లకు ఉంటుంది. కొన్ని సర్వేలు ప్రకారం.. దాదాపు 40 శాతం మంది పిల్లలు, సగం మంది టీనేజర్లు గోర్లు కొరుకుతారు.
nail
గోర్లను కొరకూడదంటే?
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ఈ కింది చిట్కాలు గోర్లు కొరికే అలవాటును పోగొడుతాయి.
మీ గోళ్లను చిన్నగా కట్ చేయండి.
చేదుగా ఉండే నెయిల్ పాలిష్ ను మీ గోళ్లకు అప్లై చేయండి.
గోర్లను కొరకాలని అనిపించినప్పుడల్లా స్ట్రెస్ బాల్ న్ నొక్కండి.
మీ గోర్లు కొరకడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
మీ గోర్లు కొరకడం ఆపడానికి ప్రయత్నించండి.