MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • జుట్టు సంరక్షణ కోసం వీటిని ట్రై చెయ్యండి.. బెస్ట్ హెయిర్ టిప్స్ ఇవే!

జుట్టు సంరక్షణ కోసం వీటిని ట్రై చెయ్యండి.. బెస్ట్ హెయిర్ టిప్స్ ఇవే!

చాలామంది అందంగా (Beautiful) కనిపించడం కోసం ముఖ సౌందర్యం కోసం ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ అందంగా కనిపించాలంటే ముఖ సౌందర్యంతో పాటు జుట్టు సంరక్షణ (Hair care) కూడా ముఖ్యమే. 

2 Min read
Author : Navya G
Published : Aug 20 2022, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ముఖం ఎంత అందంగా ఉన్నా జుట్టు ఒత్తుగా, పొడవుగా లేకుండా పలుచగా ఉండి నిర్జీవంగా కనిపిస్తే ముఖ సౌందర్యం కూడా తగ్గుతుంది. కనుక జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడితే ఒత్తయిన, పొడవైన, సిల్కీ జుట్టు మీ సొంతం అవుతుంది. మరి ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

రోజు రోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, శరీరంలోని హార్మోన్ల మార్పు, కొన్ని మందుల వాడకం, పోషకాహార లోపం, అధిక మొత్తంలో కెమికల్స్ కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి (Harms hair health). దీంతో జుట్టు ఎక్కువ మొత్తంలో ఊడిపోతుంది. కనుక జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ (Special attention) తీసుకోవాలి.
 

37

వాతావరణ కాలుష్యం కారణంగా తల, జుట్టులో దుమ్ము, ధూళి అధికంగా చేరి తలభాగం అపరిశుభ్రంగా ఉంటుంది. దీంతో జుట్టు సమస్యలు (Hair problems) ఏర్పడతాయి. కనుక తల, జుట్టును శుభ్రంగా ఉంచుకునేందుకు తరచూ తలస్నానం (Head bath) చేయాలి. దీంతో తలభాగం శుభ్రంగా ఉంటుంది. తలస్నానానికి గాడత తక్కువ గల షాంపులను ఉపయోగించాలి.

47

తలస్నానానికి షాంపూలకు బదులుగా కుంకుడు, సీకాయిలను ఉపయోగిస్తే మంచిది. వీటిని   ఉపయోగిస్తే జుట్టుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కలగవు. తలస్నానం తరువాత జుట్టు కుదుర్లను ఆరోగ్యంగా ఉంచడానికి కండిషనర్ (Conditioner) ను అప్లై చేసుకోవడం మంచిది. దీంతో జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి.
 

57

అలాగే కొబ్బరినూనె, ఆలివ్, బాదం వంటి ఇతర  నూనెలను జుట్టుకు పట్టించాలి. ఈ నూనెలు జుట్టు కుదుళ్లకు కావలసిన పోషకాలను అందించి జుట్టు కుదుర్లను (Hair follicles) బలపరుస్తాయి. కనుక వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ నూనెలను వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు, జుట్టుకు బాగా మసాజ్ (Massage) చేసుకోవాలి.
 

67

ఇలా చేస్తే తలభాగంలో రక్తప్రసరణ (Blood circulation) మెరుగుపడి జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. దీంతో జుట్టు బలంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి మనం తీసుకునే ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కనుక అధిక ప్రోటీన్లు (Proteins) ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి జుట్టుకు కావలసిన పోషకాలను అందించి వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
 

77

అలాగే తలలో ఏర్పడే ఇన్ఫెక్షన్ (Infection) లను కూడా తగ్గిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, మంచి నివారింపు కోసం ఇంటిలోనే తయారు చేసుకునే సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్స్ (Hair packs) ను మాత్రమే ఉపయోగించాలి. ఇందుకోసం నిమ్మరసం, పెరుగు, గుడ్డు, మందారం, గోరింటాకు వంటి పదార్థాలతో తయారుచేసుకునే హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగించడం మంచిది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image2
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image3
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved