Health Tips: మలబద్ధకంతో విసిగిపోయారా.. అయితే ఈ ఆహారం మీ సమస్యకు చక్కని పరిష్కారం!
Health Tips : పొద్దున్నే మలవిసర్జన జరగకపోతే ఆ రోజంతా చాలా ఇబ్బందిగా గడుస్తుంది. ఒంట్లో చురుకుతనం పోతుంది. అయితే ఇంటి చిట్కాలతో ఈ మలబద్ధకానికి చెక్ పెట్టడం ఎలాగో చూద్దాం.
మలబద్ధకం అనేది ఏ వయసులో ఉన్నవారికైనా రావచ్చు. మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం శరీరంలోని వ్యర్ధాలు బయటికి పోకపోవటం మలబద్ధకానికి ప్రధాన కారణం. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఎలాంటి పదార్థాలను తింటే పరిష్కారం లభిస్తుందో మన పూర్వీకులు చెప్పిన విధానం చూద్దాం.
మలబద్ధకం కోసం ఎండు ద్రాక్ష మంచి ఔషధం. ఎండు ద్రాక్షలో అధికంగా ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీల మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రాత్రి ఒక కప్పులో నీరు పోసి 20, 25 ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తాగటం తర్వాత ఆ ఇంటి ద్రాక్షని తినడం వల్ల మలబద్ధకం క్రమక్రమంగా తగ్గుతుంది.
అలాగే నిమ్మరసం కూడా మలబద్ధకాన్ని త్వరగా వరి కడుతుంది.ఇందులో ఉండే టార్టినెస్ మరియు సోడియం గట్టి మలాన్ని పలుచగా చేసి మలబద్ధకం నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది మొత్తం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. గోరువెచ్చని నీళ్లలో చెంచా నిమ్మరసం..
చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపున తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగం నూనె కూడా మలబద్దకానికి మంచి ఔషధం దీనిని ఒక గ్లాసు పాలలో చెంచా నూనె కలుపుకొని తాగడం వలన ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆకుకూరలు మన పొట్ట మరియు ప్రేగులను శుభ్రపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క నారింజ పండు చొప్పున తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది.
అలాగే ఒక చెంచా అవిసె గింజల పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అవిసె గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మలబద్ధకానికి మంచి ఔషధం.